వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నూతన కన్వీనర్
నల్లచెరువు సెప్టెంబర్ 19
వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ గా బట్టి హైదరవలి నియామకమైనట్లు ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక బస్టాండ్ కూడలిలోని దిగవంతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గతంలో మండల కన్వీనర్ గా ఉన్న రమణారెడ్డి స్థానిక ఎన్నికల్లో ఎంపీపీగా గెలుపొందడంతో అప్పటినుంచి మండల కన్వీనర్ బాధ్యతలను అధిష్టానం ఎవరికి అప్పజెప్పలేదు.గత కొంతకాలంగా మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఎవరు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఆదేశాల మేరకు మండలంలో సీనియర్ నాయకుడైన బీసీ వర్గానికి చెందిన బట్టి హైదర్వలిని మండల కన్వీనర్ గా నియమించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.మండల కన్వీనర్ గా ఎన్నికైన బట్టి హైదరవలి మాట్లాడుతూ తనకు ఇలాంటి అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి,కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డికి, మండల ఎంపీపీ రమణారెడ్డికి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మండలంలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి తమదైన శైలిలో ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో పార్టీ పెద్దలు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానన్నారు.ప్రాణం ఉన్నంత వరకు వైకాపాతో ఉంటూ కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కోసం పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ పంచరత్నమ్మ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.