ప్రయివేట్ బస్సు అదుపు తప్పి కెనాలోపడ్డది. ఎనిమిది మంది మృతి చెందారు. ఈఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయివేట్ బస్సు 65 మంది ప్రయాణికులతో ముక్త్సర్ నుంచి కొట్కాపురా వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఝాబెల్‌వాలి శివారులోని సిర్హింద్ సమీపంలోని కాలువలో మధ్యాహ్నం ఒంటిగంటకు పడిపోయింది. ఎనిమిది మంది మృతిచెందారు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటన బాధాకరమని, ప్రస్తుతం సంఘటనా స్థలంలోనే అధికారులు ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …