- గర్భం దాల్చడంతో వెలుగులోకి..
- రాజస్తాన్లో ఘటన
ఇద్దరు అక్కాచెళ్లలపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్లో చోటుచేసుకుంది. వాళ్ల తండ్రి ఇటుక బట్టిలో పనిచేస్తున్నాడు. 15 ఏండ్ల పెద్దకుమార్తె కు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె 7 నెలల గర్భవతి నిర్ధారించారు. చిన్నమ్మాయి (13 )కి కూడా పరీక్షలు జరపడంతో ఆమె రెండున్నర నెలల ప్రెగ్నెట్ అని తేలింది. దీంతో వారు అసలు విషయం బయట పెట్టారు. వారి తండ్రితో పనిచేసే సప్పి, సుభాన్ ఇద్దరు యువకులు వారిపై ఈ అఘాత్యానికి పాల్పడ్డారని తెలిసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.