అది భార‌త్ రాకెట్ శ‌క‌ల‌మే.

  • .ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ నిర్ధార‌ణ

నెల రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని పెర్త్ స‌ముద్ర తీరానికి ఒక గుర్తు తెలియ‌ని వింత వ‌స్తువు ఒక‌టి కొట్టుకొచ్చింది. ఆ వ‌స్తువుపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. అది గ‌హంత‌ర వాసుల‌ద‌ని, స్పేస్ నుంచి వ‌చ్చిన శ‌క‌ల‌మ‌ని ర‌క‌ర‌కాలుగా వ‌ర్ణించారు. ఎట్ట‌కేల‌కు దాని మిస్ట‌రీ వీడింది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్పేస్ అధికారులు స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ఆ వ‌స్తువు భార‌త రాకెట్ శ‌క‌ల‌మ‌ని తేల్చారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్కు చెందిన మూడ‌వ స్థాయి వ్య‌ర్థ‌మ‌ని ఆస్ట్రేలియ‌న్ స్పేస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. 2.5 మీట‌ర్ల 2.5 వెడ‌ల్పుతో ఉన్న ఆ వ‌స్తువును నెల రోజుల నుంచి పోలీసుల ప‌ర్య‌వేక్ష‌ణలో ఉంచారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *