కస్టమర్లకు శాంసంగ్ ఊహించని షాక్.. లాంచ్ అయిన వారానికే మొబైల్ ధరలు పైపైకి!

కొత్త ఫోన్ కొనాలనుకునే శాంసంగ్ ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. భారత మార్కెట్లోకి అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చిన ‘శాంసంగ్ గెలాక్సీ M47 5G’ (Samsung Galaxy M47 5G) స్మార్ట్‌ఫోన్ ధరలు వారం రోజుల్లోనే ఆకాశాన్ని తాకాయి. జూలై 4న సేల్‌కు వచ్చిన ఈ మొబైల్ కొనుగోలుపై అప్పట్లో ఇచ్చిన లాంచ్ ఆఫర్లు ముగియడమే కాకుండా, కంపెనీ ఏకంగా బేస్ ప్రైస్‌ను కూడా భారీగా పెంచేసింది. వేరియంట్లను బట్టి ఏకంగా రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు ధరలు పెరగడం ఇప్పుడు మొబైల్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏ వేరియంట్ ధర ఎంత పెరిగిందంటే?

  • 6GB + 128GB (బేస్ వేరియంట్): దీని అసలు లాంచ్ ధర రూ. 25,999 కాగా, ఆఫర్లలో రూ. 22,999 కే లభించింది. కానీ, ఇప్పుడు అమెజాన్ ఇండియాలో దీని ధర ఏకంగా రూ. 32,999 కి చేరింది. అంటే దాదాపు రూ. 7,000 పెరిగింది.

  • 8GB + 128GB వేరియంట్: లాంచ్ ఆఫర్ లో రూ. 25,999 కి దొరికిన ఈ మోడల్, ఇప్పుడు రూ. 36,999 కి విక్రయిస్తున్నారు.

  • 8GB + 256GB (టాప్ ఎండ్): ప్రారంభంలో రూ. 30,999 ఉన్న ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 41,999 కి చేరింది. ఈ రెండు మోడళ్లపై ఏకంగా రూ. 8,000 వరకు భారం పడింది.

అసలు శాంసంగ్ వ్యూహం ఏంటి?

ప్రస్తుతం మార్కెట్లో మెమొరీ చిప్స్, ఇతర విడిభాగాల ధరలు పెరుగుతుండటంతో నథింగ్, రియల్‌మీ, షియోమీ వంటి బ్రాండ్లు తమ పాత ఫోన్ల ధరలను పెంచుతున్న మాట నిజమే. ఎందుకంటే అవి పాత ఖర్చుల అంచనాలతో మార్కెట్లోకి వచ్చినవి. కానీ, కేవలం వారం క్రితమే లాంచ్ అయిన ఫోన్ ధరను శాంసంగ్ ఇలా పెంచేయడం వెనుక లాజిక్ ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

ఫోన్ విడుదల చేసే సమయానికే కంపెనీకి విడిభాగాల ఖర్చులన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి, ఇది కేవలం ప్రారంభంలో కస్టమర్లను ఆకర్షించడానికి (Early Buyers) పెట్టిన తాత్కాలిక ఆఫర్ మాత్రమేనని, ఆ తర్వాత రేట్లు పెంచాలనేది కంపెనీ ముందుస్తు ప్లాన్ అయి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, వారం రోజులు ఆలస్యంగా కొందామనుకున్న కస్టమర్లకు మాత్రం ఇది గట్టి షాకేనని చెప్పాలి.

భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో వస్తున్న రెడ్‌మి నోట్ 17 సిరీస్.. లీకైన పూర్తి వివరాలు!

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో రివ్యూ: 6500mAh బ్యాటరీతో అదుర్స్, కానీ ఇండియాలో..!