ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన కొత్త ‘Z11 సిరీస్’ పరికరాలను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ‘iQOO Z11 Lite’ విడుదలపై స్పష్టత రాగా, ఇప్పుడు దీని స్టాండర్డ్ వేరియంట్ iQOO Z11 కూడా త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది.
ప్రముఖ టిప్‌స్టర్ డీబయన్ రాయ్ సమాచారం ప్రకారం.. I2514 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ BIS సర్టిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. భారతదేశంలో అధికారిక లాంచ్‌కు ముందు దాటాల్సిన ముఖ్యమైన ప్రక్రియ ఇదొక్కటే కావడంతో, ఈ ఫోన్ త్వరలోనే భారత వినియోగదారుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
iQOO Z11 (స్టాండర్డ్) అంచనా స్పెసిఫికేషన్లు:
లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ స్టాండర్డ్ మోడల్ అద్భుతమైన ఫీచర్లతో మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీని ఇచ్చేలా ఉంది.
-
డిస్‌ప్లే: ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది.
-
ప్రాసెసర్: గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్ ప్రకారం.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 (MediaTek Dimensity 7500) చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది.
-
స్టోరేజ్ & ర్యామ్: UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో పాటు 12GB RAM ఉండవచ్చు.
-
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది.
-
బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే కానుంది. ఏకంగా 8,000mAh నుండి 9,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో ఇది వచ్చే అవకాశం ఉంది.
కొన్ని నివేదికల ప్రకారం, చైనాలో విడుదలైన ‘Vivo S60e Vitality Edition’ ఫోన్‌ను భారతదేశంలో ‘iQOO Z11’ పేరుతో రీబ్రాండ్ చేసి లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ముందుగా రానున్న ‘iQOO Z11 Lite’:
స్టాండర్డ్ మోడల్ కంటే ముందే, iQOO Z11 Lite జూలై మధ్యలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
-
ఈ లైట్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6,500mAh బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది.
-
ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది. ఇందులో కంటెంట్ క్రియేషన్, లైవ్ క్యాప్షనింగ్ కోసం ప్రత్యేక AI ఫీచర్లను కూడా అందించనున్నారు.
ధర మరియు పోటీ:
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న iQOO Z11x (ధర రూ. 22,999) కంటే ఈ కొత్త iQOO Z11 మోడల్ కాస్త ఎక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ. 25,000 లోపు ఉండే ఛాన్స్ ఉంది. ఈ ధర విభాగంలో భారీ బ్యాటరీ ఫోన్‌గా రానున్న iQOO Z11.. మార్కెట్లోని మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion) వంటి ఇతర మిడ్-రేంజ్ ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
అయితే, ప్రస్తుతం లీక్ అయిన వివరాలన్నీ ప్రాథమిక అంచనాలు మాత్రమే. పూర్తి స్పెక్స్ మరియు లాంచ్ ఆఫర్ల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే
కింది టైటిళ్లపై క్లిక్ చేసి ఇవి కూడా చదవండి
సింగిల్ ఛార్జ్‌పై 187 కిమీ రేంజ్.. మార్కెట్లోకి హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘Vida VX2 Plus’!
కస్టమర్లకు శాంసంగ్ ఊహించని షాక్.. లాంచ్ అయిన వారానికే మొబైల్ ధరలు పైపైకి!
పత్తి మొక్కలు ఎండిపోకుండా బకెట్లతో నీళ్లు!వాన కోసం రైతన్న ఆరాటం:
