తెలిసి తెలియని వయసులో ఉపాధికి వెళ్లి అక్కడ తప్పి మళ్లీ 16 ఏండ్ల తరువాత తల్లిదండ్రలను కలుసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ని ఘాజియాపూర్ జిల్లా మహ్మదాబాద్ తహసీల్ యూపఫ్‌పూర్ గ్రామానికి చెందిన సంత్రాదేవి, మున్నాకుమార్ లకు నలుగురు
కొడుకులు, ఓ బిడ్డ ఉంది. ఈ క్రమంలో 16 ఏండ్ల క్రితం మహేందర్ అనే పెద్ద కుమారుడు సరిగ్గా ఉహ తెలియని వయస్సులో పని కోసం బొంబాయి వెళ్లాడు. అక్కడ కొంత కాలం పనిచేసిన తరువాత అదే రాష్ట్రానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరు కలిసి పనికోసం తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లికి వచ్చారు. బెల్లంపల్లిలోని మనీషా బేకరిలో పని చేస్తూ 16 ఏండ్లు ఇక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో తన తల్లి దండ్రులు గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో బేకరి యజమాని సుశీల్ కుమార్ తో తన బాధ ను చెప్పుకున్నాడు. బేకరి యజమాని తన మిత్రడైన ఓకానిస్టేబుల్ సహాయంతో అతడి తల్లిదండ్రుల వివరాలను సేకరించి విషయాన్ని వారికి తెలిపాడు. వారు బెల్లంపల్లికి చేరుకుని మహేందర్ ను పరిశీలించి చిన్ననాడు గొంతు కింద జరిగిన ఆపరేషన్ మచ్చను
చూసి గుర్తుపట్టి సంతోషం వ్యక్తం చేశారు. మహేందర్‌ను తమ సొంత గ్రామానికి తీసుకెళ్లారు.