ఐదుగురి అరెస్ట్
ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దుష్ట శక్తులు ఆవహించాయి, పూజలు చేయాలి. వాస్తు దోషముంది అంటూ ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ లైంగిక దాడి ఐదేళ్లుగా జరుగుతోంది. బాధితురాలితో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాకు చెందిన 35 ఏండ్ల మహిళ, ఆమె భర్త నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ భద్రత, ఆమె భర్తకు దుష్టశక్తులు ఆవహించాయని, ఇంట్లో వాస్తు దోషముందంటూ భర్త స్నేహితులు ఐదుగురు ఆమెను నమ్మించారు. ఆమె భర్తకు ఎటువంటి అపాయం జరగకూడదు అంటే తాము చెప్పినంటూ చేయాలని చెప్పారు. ఇంట్లో శాంతి పూజలు చేయాలని నమ్మబలికారు. ఈ పూజల పేరుతో 2018 నుంచి ఆ మహిళ ఇంటి వద్ద ఒక్కతే ఉండడాన్ని గమనిస్తూ ఇంటికి వెళ్లే వారు. ఈ క్రమంలో పూజలు చేయాలని చేసేముందు పంచామృతం అంటూ ఓ పానియం ఇచ్చి తాగుమనేవారు. అందులో మత్తు మందు కలిపి తాగించేవారు. ఆమె మత్తులోకి జారుకోగానే ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవారు. 2019లో థానేలోని యూర్ ఫారెస్ట్‌లో, కందివాలిలోని ప్రధాన నిందితుడి మఠంలో, లోనావాలాలోని రిసార్ట్‌లో కూడా ఆ మహిళపై ఆమె భర్త స్నేహితులు అత్యాచారం చేశారు. దీంతో పాటు పూజల పేరుతో 2 లక్షల రూపాయలతో పాటు బంగారాన్ని కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందితులైన రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్, గణేష్ కదమ్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఆకతాయి.. చున్నీ లాగి అమ్మాయి ప్రాణం తీశావు కదరా.
హలో ముంబై పోలీస్.. ఆ బస్సులపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను