హలో ముంబై పోలీస్.. ఆ బస్సులపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను
ఆనంద్ మహేంద్ర ట్వీట్
ఆనంద్ మహీంద్ర ప్రముఖవ్యాపారవేత్త. సోషల్ మీడియాలోనూ చాలా హుషారుగా ఉంటారు. ఎన్నో ఆసక్తికర విషయాలను, కరెంట్ ఇష్యూలను నెటిజన్లతో పంచుకుంటారు. ఆయన ప్రస్తుతం ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. 80ఏండ్లకు పైగా కీలకపాత్ర పోషించిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులను అక్కడి ప్రభుత్వం వీడ్కోలు పలకనున్నారు. దీనిక స్పందించిన ఆయన ‘హలో ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకదాన్ని దొంగలించడాన్ని విూకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 1990వ సంవత్సరం నుంచి ముంబై సిటీని చూడడానికి వచ్చిన వారికి సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో 2008 నుంచి వాటి నిర్వహణను ఆపివేశారు. దీంతోపాటు తాజా ఈ బస్సులకు స్వస్తి పలకాలని అక్కడి అధికారులు నిర్ణయిచారు. ఇంకొక వారం రోజుల్లో ఈ బస్సులు బొంబాయి రోడ్ల నుంచి కనుమరుగు కానున్నాయి. ఈ బస్సుల్లో కనీసం రెండింటినైనా మ్యూజియంలో ఉంచాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈమేరకు అక్కడి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి, బృహన్ బొంబాయి ఎలక్ట్రిసిటీ సప్లయ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్ కు ప్రయాణికులు లేఖలు రాస్తున్నారు.
ఈ రెడ్ కలర్ డబుల్ డెక్కర్ బస్సులను 1937లో ఫస్ట్‌సారి ముంబాయిలో ప్రవేశపెట్టారు. 80 సంవత్సరాల పాటు ముంబై ప్రజారవాణాలో సేవలందించాయి.. ఎన్నో బాలివుడ్ సినిమాల్లో ఈ డబుల్ బస్సులను చూపెట్టారు. 1990 సంవత్సరం నాటికి 900కు చేరాయి. ఆ కాలంలో బొంబాయి సిటీలో ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఓ వెలుగు వెలిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఐకానిక్ ఎరుపు బస్సుల స్థానంలో బ్యాటరీతో నడిచే నలుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులను లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం ఇవి 25 వరకు ఉన్నాయి.
https://twitter.com/anandmahindra/status/1702715929308897477