రోడ్డు ప్ర‌మాదంలో పంచాయ‌తీ కార్య‌దర్శి మృతి

గంగాధ‌ర
రోడ్డు ప్ర‌మాదంలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి మృతి చెందారు. గంగాధ‌ర మండ‌లం కాచిరెడ్డిప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీలో విధులు నిర్వ‌ర్తిస్తున్న ర‌వీంద‌ర్ విధులు ముగించుకుని చొప్పందండికి వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో చొప్ప‌దండి స‌మీపంలో గ‌ల పెట్రోల్ బంక్ వ‌ద్ద టిప్ప‌ర్ ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృత‌దేహాన్ని క‌రీంన‌గ‌ర్ జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న క‌రీంన‌గ‌ర్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ((స్థానిక సంస్థలు ) ప్రఫుల్ దేశాయ్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ఆస్ప‌త్రికి చేరుకుని పార్దివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే బెనిఫిట్స్ అందిస్తామ‌ని చెప్పారు. అంత్యక్రియల క్రియల నిమిత్తం రూ. 30 వేల‌ను త్వర‌గా ఇవ్వాల‌ని జిల్లా పంచాయ‌తీ అధికారి వీర బుచ్చ‌య్య గంగాధ‌ర ఎంపీడీవోకు సూచించారు.

ఆక‌తాయి.. చున్నీ లాగి అమ్మాయి ప్రాణం తీశావు క‌ద‌రా.

దుష్ట శ‌క్తులు ఆవ‌హించాయి.. వాస్తుదోష‌ముందంటూ ఐదేండ్లుగా లైంగిక‌దాడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *