ఆక‌తాయి.. చున్నీ లాగి అమ్మాయి ప్రాణం తీశావు క‌ద‌రా.

ఆడ‌పిల్ల‌ల‌పై నిత్యం ఏదో చోట దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.. ఎన్ని శిక్ష‌లు వేసినా ఆక‌తాయిలు మాత్రం మార‌డం లేదు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శనివారం దారుణం జ‌రిగింది. యూపీలోని అంబేద్కర్ నగర్లోని పూజ (14) పాఠ‌శాల‌కు వెళ్లిన బాలికి తిరిగి సైకిల్‌పై ఇంటికి వ‌స్తోంది. త‌న స్నేహితులతో స‌ర‌దాగా మాట్లాడుతూ వ‌స్తున్న‌ ఈక్ర‌మంలో వెనుక నుంచి బైక్‌పై వ‌చ్చిన ఓ ఆక‌తాయి ఆమె చున్నీ లాగాడు. దీంతో ఆ బాలిక అదుపు త‌ప్పి కింద‌ప‌డింది. వెనకాల వ‌స్తున్న మ‌రో బైక్ వేగంగా పూజ‌ను ఢీకొట్టింది. దీంతో ఆమె అక‌క్క‌డిక‌క్క‌డే మృతి చెంది. ఇదంత క్ష‌ణాల్లో జ‌రిగిపోయింది. ఏం జ‌రిగిందో తెలుసుకునే లోపు పూజ ప్రాణాలు గాల్లో క‌లిశాయి. షాక్ గుర‌యిన ఆమె స్నేహితురాళ్లు పూజ ఆ స్థితిలో చూసి త‌ట్టుకోలేక‌పోయారు. ఒక్క క్ష‌ణం ముందు వ‌ర‌కు మాతో మాట్లాడిన పూజ ఇక లేద‌ని విల‌పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనికి సంబంధించి ముగ్గ‌రు ఆక‌తాయిల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది. నిందితులను క‌ఠిన శిక్షించాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

 

 

తెలంగాణా గ‌రం… గ‌రం.. ముక్కోణ‌పు పోటీ త‌ప్ప‌దా..?

మ‌రో కేబుల్ బ్రిడ్జి. ఎక్కడ అంటే

వారెవ్వ‌.. ఈ కుర్చీ త‌యారీనే వేరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *