- కొండెక్కిన కూరగాయలు
- సామాన్యుడికి ధరాఘాతం
ఏం కొనేట్టులేదు ఏం తినేటట్టు లేదు లచ్చులో.. లచ్చన్న అనే పాట ఓ పాత సినిమాలోది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. గత నెలన్నర రోజులుగా టమాటరేటు వింటనే సామాన్యుడు హడలెత్తిపోయేవాడు. ఇప్పుడు ఏ కూరగాయలైనా, ఆకు కూరలయినా కొండెక్కి కూర్చున్నాయి. టమాటా రెండు వందల నుంచి కిందకి దిగిరాన్నట్టుంది. బీర, కాకర, సోర, ఒక్కటేమిటి అన్నింటి అదే దారి.. వర్షకాలం ప్రారంభమయ్యింది. రైతులు కూడా కూరగాయల పంటలు పండించడం ప్రారంభించారు. ఈ క్రమంలో కూరగాయల రేట్లు దిగివస్తాయని అందరూ భావించారు. కానీ భారీ వర్షాలు వారం రోజుల పాటు కురవడంతో కూరగాయల తోటలు కుళ్లిపోయాయి.. దీంతో కూరగాయల కోసం పొరుగు రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తుంది. దీంతో కూరగాయ ధరలు మండిపోతున్నాయి.. మాంసం కూడా ఎక్కువ ధరనే ఉంది. చికెన్ 240 కి మటన్ 800 ఉండడంతో సామాన్యడు ఒక్కపూట తినేందుకు విలవిలాడుతున్నడు.
పప్పులు తొక్కులతోనే..
నెలకు 10 నుంచి 15 వేలు వరకు సంపాదించే సామాన్యులు కూరగాయలు కొనలేకపోతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా పప్పులవైపు మళ్లుతున్నారు. పెసర పప్పు, కంది, శెనగ, ఆలుగడ్డలతో పాటు వేసవి కాలం నిల్వ చేసుకున్న తొక్కలు(ఆవకాయ)తో కాలం వెల్లదీస్తున్నారు.
రోజుకి మినిమం 300 కూరగాయలకే
నలుగురు కుటుంబ సభ్యుల ఉన్న వారు ఒక్క రోజు కూరగాయలతో తినాలంటే మినిమంగా అవుతుందని పలువురు సిటిజన్స్ వాపోతున్నారు. సంపాదన మొత్తం కూరగాయలకే పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు కూరగాయల ధరలు
. వంకాయ రూ.50, బెండకాయ రూ. 50, పచ్చిమిర్చి 140, కాకర 80, బీరకాయ రూ. 120, కాలీఫ్లవర్ రూ. 80, క్యాబేజి రూ. 50 ధర పలుకుతుంది.
పాత ఆహా నా పెళ్లాంట సినిమా కోట శ్రీనివాస రావు కోడి ని వేలాడిదీసి ఊహించుకుంటు తినే పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు.
ఇద్దరం జాబ్ చేసినా కూరగాయలు కొనలేకపోతున్నాం.
సవ్రంతి సూర్యాపేట
మా ఆయన నేను ఇద్దరం ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తాం. రోజు కూరగాయలు మార్కెట్లోనే కొంటుంటాం. ఈ గత నాలుగైదు రోజుల నుంచి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కూరగాయలు కొనలేకపోతున్నాం. ప్రత్యామ్నాయంగా పప్పలు, నిల్వ పచ్చళ్లతో కాలం ఎల్లదీస్తున్నాం. పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతున్నారు.
మార్కెట్‌కే వెళ్లడం మానేశాం.
సంధ్య నిజామాబాద్
కూరగాయలు రేట్లు బట్టి మార్కెట్ కు వెళ్లడం మానేశాం. కిరణం నుంచి ఆలుగడ్డలు, పప్పులతోనే సరిపెట్టుకుంటున్నాం. కొంత కాలం అయితే కూరగాయ ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం.