భారత వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ MS స్వామినాథన్ అని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య, ఇందూరు డిచపల్లి FPO చైర్మన్ యం.నాగయ్య అన్నారు. చెరుకు ఉత్పత్తి దారుల సంఘము,ఇందూరు డిచిపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య, ఇందూరు డిచపల్లి FPO చైర్మన్ యం.నాగయ్య మాట్లాడుతూ.. భారతదేశంలో ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి పై కృషిచేసిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కు తమ సంతాపాన్ని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశంలో తీవ్ర కరువు కాటకాలు వస్తున్న సందర్భంలో ప్రజలకు ఆహార ధాన్యాలు అందించే లక్ష్యంతో అధిక ఉత్పత్తుల కొరకు కొత్త వరి వంగడాలు విత్తనాలను తయారు చేయడంలో అగ్రగన్యుడని అన్నారు. భారత రైతు నిలబడేందుకు గాను పంటలకు కనీసం మద్దతు ధరలు అందించాలని అనేకసార్లు తన సిఫార్సుల ద్వారా ప్రభుత్వానికి అందించిన స్వామినాదన్ ను రైతాంగం మరువలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, DLDA చైర్మన్ రాజలింగం, FPO డైరెక్టర్ పెంటయ్య,రైతు నాయకులు మల్లయ్య ,సాయినాథ్, jp గంగాధర్ L శేషి ,పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ నాయకులు జన్నారపు రాజేశ్వర్, సంతోష్, రవీందర్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.
Check Also
LG Smart LED TV” 65 ఇంచులు 64 వేల రూపాయలు.. ఎల్జీ స్మార్ట్ టీవీ
LG Smart LED TV” స్మార్ట్ టీవీ లు వచ్చాకా పెద్ద పెద్ద టీవీలను కొనడం ఫ్యాషన్ గా మారింది. …
Modern Wall Clock” మెగా హోం సేల్.. మోడ్రన్ వాల్ క్లాక్ 199 నుంచే ప్రారంభం
Modern Wall Clock” అమెజాన్ మెగా హోం సేల్ లో భాగంగా మోడ్రన్ వాల్ క్లాక్ లను అతి తక్కువ …