తాయిత్తులు క‌ట్టిస్తాన‌ని.. క‌న్న‌తండ్రి ఎదుటే చంపేశాడు

ఓ అభం శుభం తెలియ‌ని అమాయ‌కురాలు త‌న తండ్రికి ఏదో తాయ‌త్తు క‌ట్టించాల‌నే ఉద్దేశ్యంతో ఓ నాటు వైద్యుడి ద‌గ్గ‌ర‌కు బ‌య‌లుదేరింది. ఆ నాటు వైద్యుడు లేకపోవ‌డంతో తిరిగి ఇంటికి ప్ర‌యాణ‌మైంది. త‌న తండ్రితో క‌లిసి ఓ ఆటోలో ఎక్కింది. ఆ ఆటో డ్రైవ‌ర్ త‌న‌కు వేరే నాటు వైద్యుడు తెలుస‌ని అక్క‌డికి తీసుకెళ్తాన‌ని చెప్పి న‌మ్మించాడు. ఆ మాట‌లు న‌మ్మి ఆటో డ్రైవ‌ర్‌తో ప్ర‌యాణ‌మైంది. కానీ ఆ ఆటో డ్రైవ‌రే క‌ర్క‌శంగా ఆమెను చంపి మెడ‌లోలో ఉన్న బంగారు ఆభ‌రణాలను ఎత్తుకెళ్లాడు. నా బిడ్డ‌ను చంపొద్ద‌ని ఆ తండ్రి ఆటో డ్రైవ‌ర్ కాళ్లుమొక్కిన వ‌ద‌ల‌లేదు ఆ దుర్మార్గుడు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా శంక‌ర‌ప‌ట్నం మండ‌లంలో ఆదివారం చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. గుండారపు ప్ర‌మీల (55) హ‌నుమకొండ జిల్లా క‌మ‌లాపూర్
మండ‌లం భీంప‌ల్లిలో నివాసురాలు. త‌న‌తండ్రి ఇజిగిరి శంక‌ర‌య్య క‌రీంన‌గ‌ర్ జిల్లా శంక‌ర‌ప‌ట్నం డ‌లంలో అర్కండ్ల‌లో ఉంటున్నాడు. ప్ర‌మీల త‌న తండ్రి కొముర‌య్య‌ను తీసుకుని మొలంగూర్‌లోని ఓ నాటు వైద్యుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. కానీ ఆ నాటు వైద్యుడు లేక‌పోవ‌డంతో తిరిగి ఇంటికి ప్ర‌యాణ‌మైంది. వారికి ఓ ఆటో డ్రైవ‌ర్ అడ్డుప‌డి త‌నువేరే నాటు వైద్యుడి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తాన‌ని మాయ మాట‌లు చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు. అక్క‌డి నుంచి తాడిక‌ల్ గ్రామంలోని శివాల‌యానికితీసుకెళ్లి ఒక్క‌సారిగా క‌త్తితో దాడి చేశాడు. త‌న బిడ్డ‌న ఏం చేయొద్దు, చంపొద్ద‌ని కొముర‌య్య‌ కాళ్లుమొక్కిన వ‌ద‌ల‌కుండా క‌త్తితో పొడిచాడు. ప్ర‌మీల ర‌క్త‌మ‌డుగులో కుప్ప‌కూలిమ‌ర‌ణించింది. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచార‌మందించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంగారు న‌గ‌ల కోసమే ప్ర‌మీల‌పై దాడి చేసిన‌ట్టు పోలీసులు  ప్రాథ‌మికంగా భావిస్తున్నారు.

లారీని ఢీకొట్టిన బ‌స్సు.. 15 మందికి తీవ్ర‌గాయాలు..

డ్రైనేజిలో ప‌డి హెడ్ కానిస్టేబుల్ మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *