తెలియని రూట్లలో ప్రయాణించినప్పుడు సాధారణంగా చాలా మంది గూగుల్ మ్యాప్ వాడుతుంటారు. అయితే అప్పుడప్పుడు అది పక్కదారి కూడా పట్టిస్తుంటంది. గూగుల్ మ్యాప్‌లో లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని సూచించగా వారు అలాగే చేశారు. కానీ కారు ఏకంగా నదిలో పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొచ్చికి చెందిన ఐదుగురు వ్యక్తులు రాత్రి సమయాన ప్రయాణమయ్యారు. భారీ వర్షం కారణంగా వారికి రోడ్డు సక్కగా కనపడక పోవడంతో గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించారు. లెఫ్ట్ వైపు తిరగండని సూచించడంతో వారు అటువైపు మలిగారు. దీంతో కారు ఒక్కసారిగా పెరియార్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు డాక్టర్ అద్వైత్ (29), అజ్మల్ (29) మృతి చెందారు. వీరితో పాటు మరో ముగ్గురు వీరి స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రిక తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అయ్యో చిన్నారి… షాపింగ్ మాల్‌లో కరెంట్‌షాక్‌తో నాలుగేండ్ల చిన్నారి మృతి
తాయిత్తులు కట్టిస్తానని.. కన్నతండ్రి ఎదుటే చంపేశాడు
పక్కనున్న గంట గుర్తు నొక్కి నోటిఫికేషన్ అలో అనండి మా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి