శుక్రవారం హైదరాబాద్ లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పిల్లలను చంపి కన్నవారు సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన జ్యోతి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నది. ఆమెకు ఇద్దరు కొడుకులు కాగా వారికి ఆరోగ్య సమస్యలు ఉండడంతో జ్యోతి కొంత కాలంగా డిప్రెషన్‌లో ఉందని బంధువులు చెప్పారు. దీంతో పాటు పని ఒత్తిడి కూడా ఉన్నట్టు వారు తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లలను చంపి ఆమెకు ఆత్మహత్య పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. భార్యా ఆత్మహత్యతో కలత చెందిన భర్త ఆమె విజయ్ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతడిని దవాఖానాకు తరలించారు.
సికింద్రబాద్‌లోని బోయినిపల్లిలో నివాసం ఉంటున్న శ్రీకాంతాచారి అనే వ్యక్తి తమ కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు.. నిదానంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకుతుంది. మానసిక నిపుణులను కలిసి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. జీవితం చాలా విలువైనది
ఇవి కూడా చదవండి
మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా
పశువులు అమ్ముతానని చెప్పి.. కండ్లల్లో కారం కొట్టి.. రూ. 80 వేలు అపహరణ
డబ్బుల వివాదం.. అత్తను గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు