డ‌బ్బుల వివాదం.. అత్తను గ‌న్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

డ‌బ్బుల వివాదం చినికి చినికి ఓ హ‌త్య‌కు దారితీసింది. కోపోద్రిక్తుడైన అల్లుడు అత్త‌ను రివాల్వ‌ర్‌తో కాల్చి చంపిన ఘ‌ట‌న హ‌న్మ‌కొండ జిల్లా గురువారం చోటు చేసుకుంది. హ‌న్మ‌కొండ జిల్లా గుండ్ల‌సింగారం చెందిన క‌మల‌మ్మకు ఆమె అల్లుడు ప్ర‌సాద్‌కు కొంత కాలంగా డ‌బ్బుల వివాదం కొన‌సాగుతున్న‌ది. ప్ర‌సాద్ రామ‌గుండం క‌మిష‌న‌రేట్‌లోని మంచిర్యాల జిల్లా కోట‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్గా విధులు నిర్త‌ర్తిస్తున్నాడు. ఈక్ర‌మంలో గురువారం గుండ్ల‌సింగారంలో క‌మ‌లమ్మ‌కు ప్ర‌సాద్‌కు మ‌ధ్య డ‌బ్బుల విష‌య‌మై వివాదం చోటు చేసుకుంది ఈ క్ర‌మంలో ఆవేశానికిలోనైన ప్ర‌సాద్ గ‌న్‌తో కాల్పులు జ‌రిపిన‌ట్టు తెలుస్తున్న‌ది. క‌మ‌ల‌మ్మ స్పాట్‌లో చ‌నిపోయింది. ప్ర‌సాద్‌పై క‌మ‌ల‌మ్మ కుటుంబ స‌భ్య‌లు దాడిచేశారు. దీంతో ప్ర‌సాద్ గాయాల‌వ‌డంతో ఎంజీఎం ఆస‌ప్రత్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

‘మ‌హా ‘మ‌ర‌ణాలు 24 గంట‌ల్లో 9 మంది.. 8 రోజుల్లో 108 మృతి

పెద్ద‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య

బైక్‌పై చేజ్‌.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *