తన దగ్గర పశువులు ఉందని అమ్ముతానని చెప్పి ఓ పశువుల వ్యాపారిని బైక్ పై ఎక్కించుని కొద్దిదూరం వెళ్లాక కండ్లల్లో కారం కొట్టి వ్యాపారి వద్ద ఉన్న రూ. 82 వేలు ఎత్తుకెళ్లాడో దుర్మార్గుడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. మానకొండూర్ సీఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు గ్రామానికి చెందిన అంకతి రాజయ్య పశువుల బ్యారం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం పశువులు కొనేందుకు అంగడికి వెళ్తూ టిపిన్ చేసేందుకు శంకరపట్నం మండలంలోని తాడికల్ వద్ద ఓ హోటల్లో ఆగాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా రాజయ్య వద్ద డబ్బులున్న విషయాన్ని ఓగుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. రాజయ్యతో మాటలు కలిపి తన వద్ద పశువులు ఉన్నాయని, వాటిని అమ్ముతానని నమ్మబలికాడు. పశువులు చూపిస్తాని మానకొండూర్ మండలం శంషాబాద్ గ్రామం వైపుతీసుకెళ్లి అక్కడ నుంచి చింతగట్టు శివారులోని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ దుండగుడు రాజయ్యకండ్లల్లో కారం కొట్టి , కత్తితో గాయపరిచి అతని వద్ద ఉన్న రూ. 82 వేలను తీసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికివెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజ్ కుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
బైక్‌పై చేజ్.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి
డబ్బుల వివాదం.. అత్తను గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు