హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎంను సోమవారం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. యశోధ ఆస్పత్రి కి చేరుకున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడారు. చికిత్స కు సంబంధించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందనేది అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ప్రార్థించారు. ఈ నెల 7 కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఆయన జారిపడ్డ విషయం తెలిసిందే.
సినీ నటుడు, చిరంజీవి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి సోమవారం యశోద ఆస్పత్రిలో పరామర్శించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు.
డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. pic.twitter.com/dtGmlHTKch
— BRS Party (@BRSparty) December 11, 2023
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి సోమాజిగూడ యశోదలో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. pic.twitter.com/QFQnPLOZkh
— BRS Party (@BRSparty) December 11, 2023
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.@KChiruTweets pic.twitter.com/wKzucBQMdm
— BRS Party (@BRSparty) December 11, 2023
370 ఆర్టికల్ రద్దు సమర్థనీయమే
హిందువుల కల నిజం కాబోతున్నది : వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
రేవంత్ అన్నా అని పిలవగానే.. మహిళ సమస్య విన్న సీఎం
ఉర్లగడ్డ.. ఉల్లిగడ్డ.. పొటాటోను ఏమంటారు..? వైసీపీ వర్సెస్ టీడీపీ