ప్రతి 50 కిలోమీటర్లకు భాష, మాట్లాడే యాస మారుతుంటతది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒకే ఐటెంను ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఇప్పుడిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఓ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా అని పక్కనున్న వారిని అడగుతాడు. దీంతో వారు బంగాళ దుంప అంటూ చెబుతారు.
ఇప్పుడు దీనిపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో ఓ యుద్దమే జరుగుతోంది. రాయలసీమలో బంగాళ దుంపలను ఉర్లగడ్డ, ఉల్లగడ్డ అని, ఉల్లి గడ్డలను ఎర్రగడ్డలని అంటారు. ఇదేఅన్నాడని వైఎస్సార్‌సీపీ నాయకులు సమర్థిస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం లేదు పొటాటో అంటే ఉల్లిగడ్డలన్నడని ఉల్లిగడ్డలంటే ఎర్రగడ్డలంటారని సోషల్ మీడియాలో మీమ్స్‌తో ఎదురుదాడికి దిగుతున్నారు.
ప్రాంతాల మధ్య యాస, కొన్ని పదాలు మధ్యతేడాలుండడటం సహజమే. ఈ సందర్భంగా మేం ఇంటర్మీడియట్ సెకండియర్ (2007 ) చదివే రోజుల్లో బొటని (వృక్షశాస్త్రం) సబ్జెక్టు చెప్పడాని కోస్తాంధ్ర నుంచి అధ్యాపకురాలు వచ్చింది. మాది కరీంనగర్ కావడంతో యాసలో కొంచెం తేడా ఉండేది. ఓ సందర్భంలో ఉల్లిగడ్డల గురించి ప్రాక్టికల్ రికార్డులో రాయాల్సి వచ్చింది. కరీంనగర్‌లో ప్రాంతంలో ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, ఆలుగడ్డలు అని బుక్క్‌లో రాశాం. ఆమె (ఆధ్యాపకురాలు) కొంత నవ్వుతూ ఈ పదాలను అప్పుడే విన్నానని తమ ప్రాంతంలో ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, బంగాళ దుంపలు అంటారని మాకు వివరించింది.
ఇలా తెలంగాణాలోనూ కొన్నింటిలో తేడా స్పష్టంగా కనబడుతోంది. ఆ మధ్యకాలంలో విడుదలయిన ఓ సినిమాలోని కొర్రాసు నెగడోలే అని పదం వినబడుతోంది. అదే పదాన్ని మరొక ప్రాంతంలో కొర్రాయి నెగడు అని వాడుకంగా ఉంది. మరొక సందర్భంలో రూపాయి కాయిన్స్‌ను కొన్ని చోట్ల బిల్లలు, అని మరికొన్ని చోట్ల సిక్కాలు అనే పదాలు ఉచ్చరిస్తున్నారు. అంతా తెలుగు భాషే అయినా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి..
ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి ఏం అన్నాడో, దానికి టీడీపీ ఏం కౌంటర్లు వేస్తుందో ఆ సబ్జెక్టులోకి మేం వెళ్లదలుచుకోలేం. సోషల్ మీడియాలో కొన్నిపదాల గురించి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి కొన్నింటిని గుర్తు చేస్తున్నాం.
మా రాయలసీమ యాస, భాష లో pottots ని ఉల్ల గడ్డలు, మరియు Onnions ని ఎర్రగడ్డ or ఉల్లిగడ్డ అంటం రా చిల్లర టిడిపి @iTDP_Official pic.twitter.com/buwDHI2X5L
— Anitha Reddy (@Anithareddyatp) December 8, 2023
Synonym of potato is Onion – JAGAN 😂🙏
— Pawanism Network (@PawanismNetwork) December 8, 2023
ఇవి కూడా చదవండి
మేం ఎప్పుడు ప్రజల పక్షమే.. బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారు మాజీ మంత్రి హరీశ్‌రావు
వైద్యుల పర్యవేక్షణలో నడుస్తున్న మాజీ సీఎం వీడియో విడుదల