ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాళ్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లారు. అయ్యప్పను దర్శించుకున్న తరువాత తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో తమిళనాడులోని మధురై చేరుకున్నాకా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గ్రామానికి చెందిన తలారి సుబ్బయ్య నాయుడు,నర్రా సాంబయ్య,రాజులు మృతి చెందారు.
మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
సాయం చేసిన యువతికి థ్యాంక్సు చెప్పిన ఏనుగుపిల్ల వీడియో వైరల్
ఆ ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తాం: సీఎం
మరణ కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు.. చాలా సంతోషం.. సీఎంకు మాజీడీఎస్పీ నళిని బహిరంగ లేఖ