Car Accident” ఫోన్ పట్టుకున్నామంటే చాలు చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. రోడ్డు దాటే క్రమంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అన్నోజి గూడకు చెందిన గిరి ఫోన్ మాట్లాడుతూ.. రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో కారు వస్తుందని కూడా గమనించకుండా ముందుకు వెళ్తున్నాడు. కారు గిరిని ఢీ కొట్టడంతో సుమారు 10 మీటర్లు ఎగిరిపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ – పోచారం ఐటీ కారిడార్ ఆదివారం సాయంత్రం (జులై 14న) చోటుచేసుకుంది. గమనించి స్థానికులు గిరిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గిరి మృతి చెందాడు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇలా రోడ్డు దాటడం ప్రమాదకరం! మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండి, బాధ్యతగా నడుచుకోండి. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు గురికాకండి.
ఈ యాక్సిడెంట్ హైదరాబాద్-వరంగల్ మార్గంలోని అన్నోజీగూడలో సోమవారం జరిగింది. @MORTHIndia #RoadAccident pic.twitter.com/4OiwFQUock
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2024
ఇవి కూడా చదవండి
Hyderabad news” ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..
bulls fight Viral video” రైలును ఆపేసిన ఎద్దుల కొట్లాట.. వీడియో..
Nashik accident” లోయలో పడ్డ బస్సు.. వీడియో తీస్తుండగానే ఘటన