Nashik accident” లోయలో పడ్డ బస్సు.. వీడియో తీస్తుండ‌గానే ఘ‌ట‌న

Nashik accident

Nashik accident”  మ‌హారాష్ట్రలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌హారాష్ట్రంలోని నాసిక్ సాత్పూర ఘాట్ వ‌ద్ద బ‌స్సు లోయ‌లో ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్‌లోని సూర‌త్ కు చెందిన కొంత‌మంది బ‌స్సులో సాత్పూర ప‌ర్వ‌తాల‌ను చూసేందుకు బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో సాత్పూర ప‌ర్వ‌తాల‌ను వీక్షిస్తూ ఘాట్ రోడ్డుపై ముందుకెళ్తున్న‌ది. ముందు వెళ్తున్న లారీని ఓవ‌ర్ టేక్ చేసే ప్ర‌య‌త్నంలో  డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో బ‌స్సు లోయలో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. మ‌రో 58 మందికి గాయాల‌యిన‌ట్టు స‌మాచారం. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ ప్ర‌యాణం సాగుతున్నస‌మ‌యంలో ఓ ప్ర‌యాణికుడు ప్ర‌కృతిని వీడియో తీస్తున్నాడు. ఈ ఘ‌ట‌న ఆదివారం (జులై 7)సాయంత్రం జ‌ర‌గ‌గా ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. వ‌ర్షా కాలం పచ్చ‌ని చెట్ల‌తో సాత్పూర ప‌ర్వ‌తాలు ఆహ్లాద‌రంగా క‌న్పిస్తాయి. దీనిని చూసేందుకు ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Marriage cheating” నిత్య పెళ్లి కూతురు.. 50 మందితో పెండ్లి..

Cyber crime” ఆ మోసాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి.. తెలంగాణ పోలీస్ ట్వీట్

Crime news” అతివేగానికి యువకుడు బలి.. ప‌రిమితంతో వాహ‌నాల‌ను న‌డ‌పాలి.,. తెలంగాణ పోలీస్ సూచ‌న వీడియో పోస్ట్

Crime news” అతివేగానికి యువకుడు బలి.. ప‌రిమితంతో వాహ‌నాల‌ను న‌డ‌పాలి.,. తెలంగాణ పోలీస్ సూచ‌న వీడియో పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *