Chikkamagaluru, Karnataka” దీపావళి వేడుకల్లో భాగంగా కర్ణాటకలోని చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండ ఆలయం వద్ద శుక్రవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ, వేలాది మంది ప్రజలు 3,000 అడుగుల కొండపైకి బండిగ దేవీరమ్మ దేవత ఆశీర్వాదం కోసం వెళ్లారు. దీపావళి సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకునే మల్లెనహళ్లిలో ఉన్న ఈ ఆలయం కర్ణాటక వ్యాప్తంగా ఉన్నభక్తులు వెళ్తారు. వారు నైవేద్యాలు, నూనె, వెన్న, నెయ్యితో కూడిన ఆచారాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోదేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల భద్రత కోసం పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు.
ఇవి కూడా చదవండి
Delhi Crime News” కాళ్లు మొక్కి.. కాల్చి చంపారు.. సీసీ వీడియో
Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవలం 299 రూపాయలే..
D.A” ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ 3.64 శాతం పెంపు
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో 31.10.2024 D.C Telugu Cinema
హిందీలో మరో చాన్స్ కొట్టేసిన రష్మిక 01.11.2024 D.C Telugu Cinema