Delhi Crime News” ఈశాన్య ఢిల్లీలోని ఘోరం చోటు చేసుకుంది. కాళ్లు మొక్కి కాల్చి చంపారు.ఈ ఘటన బీహారీల కాలనీలో గురువారం చోటు చేసుకుంది. ఇంటి ముందు దీపావళి వేడుకలు చేసుకుంటున్న 40 ఏండ్ల వ్యక్తి అతని మేనల్లుడు చనిపోయారు. అతని10 ఏండ్ల కుమారుడు గాయపడ్డాడు. కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులైన ఆకాష్ శర్మ, అతని మేనల్లుడు రిషబ్ శర్మ, కుమారుడు క్రిష్ శర్మ రాత్రి 8 గంటల సమయంలో దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఆకాష్, రిషబ్ ఇద్దరూ పసుపు రంగు కుర్తాలు ధరించి వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై అక్కడి వచ్చారు. వారు ఆకాష్ కాళ్లు మొక్కారు. అనంతరం ఆకాష్ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు స్కూటర్ పై నుంచి ఓ వ్యక్తి దిగి వచ్చి ఆకాష్ పై కాల్పులు జరిపాడు. ఆకాష్ మేనల్లుడు రిషబ్ నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆకాష్, రిషబ్, ఆకాష్ కుమారుడు గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అనంతరం గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. నిందుతులు తనకు తెలుసని, వారితో చాలా ఏండ్లుగా భూమి విషయంలో వివాదం ఉందని ఆకాష్ భార్య నేషనల్ మీడియాతో తెలిపింది. వ్యక్తిగత కక్షలతోనే ఈ కాల్పలు జరిగాయని, ఘటన స్థలంలో ఐదు రౌండ్ల బుల్లెట్లు పేలినట్టు అని షహదారా డీసీపీ ప్రశాంత్ గౌతమ్ వార్తా సంస్థ ANIకి తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని డీసీపీ వివరించారు.
दिल्ली के शाहदरा में दिवाली की रात डबल मर्डर –
हत्यारे गली में आए। पैर छूकर दिवाली की बधाई दी और चाचा आकाश की गोली मारकर हत्या की। भतीजा ऋषभ उन्हें पकड़ने को दौड़ा तो हत्यारों ने उसको भी गोली मार दी। pic.twitter.com/CFhxWl51hK
— Sachin Gupta (@SachinGuptaUP) November 1, 2024
#WATCH | Delhi: DCP Shahdara Prashant Gautam says, “At around 8.30 pm, we received a PCR call informing that there had been firing in the Bihari Colony and some people were injured. Upon reaching the spot, it was known that Akash (40) his nephew Rishab (16) and his son Krish (10)… https://t.co/BqAwGVwH9E pic.twitter.com/swBryX1AXc
— ANI (@ANI) October 31, 2024
ఇవి కూడా చదవండి
Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవలం 299 రూపాయలే..
Onion bombs” పేలిన ఉల్లిగడ్డ బాంబులు.. ముక్కలైన వ్యక్తి.. వీడియో వైరల్
Pad And Tabs” బ్రాండెడ్ ట్యాబ్, ఐప్యాడ్లపై భారీ తగ్గింపు.. హానర్ ట్యాబ్ కేవలం రూ. 9,999 కే
Cobra Viral Video” ఒళ్లు జలదరించే స్టంట్… భారీ నాగు పాము తలపై ముద్దు… వీడియో వైరల్
Virla Video” ఇదేం పోయేకాలం.. కత్తులమీద స్టంట్స్.. వీడియో వైరల్
