Paddy Bonus” కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 500 బోనస్ విడుదల చేస్తున్నది. దీంతో సన్న రకపు వడ్లు పండించిన రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అన్నదాతల ఖాతాల్లో క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ అమౌంట్ జమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల అన్నదాతల ఖాతాల్లో శుక్రవారం బోనస్ డబ్బులు యాడ్ అయినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన మెస్సేజ్ లు వారి సెల్ ఫోన్లకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పడంతో సన్నాల ధాన్యం మార్కెట్లోకి పోటెత్తుతోంది. ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్ లో 66.77 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది.గతానికంటే దొడ్డు రకాల సాగు తగ్గింది. సన్నరకపు వరి సాగు పెరిగింది. గతేడాది వానాకాలంలో వరిపంట సాగు విస్తీర్ణంలో సన్నరకపు పంట వాటా 25.05 లక్షల ఎకరాలు.. కాగా ఈ సంవత్సరం అది 40.44 లక్షల ఎకరాలకు పెరిగింది. పోయిన ఏడాది వానాకాలంలో 40.89 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాల వడ్లు సాగయ్యింది. ఈ సంవత్సరం అది 26.33 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా , ఖమ్మం జిల్లాలోని పలువురు రైతుల ఖాతాల్లో బోనస్ జమ అయినట్టు తెలుస్తున్నది.
నాయిస్ వోర్టెక్స్ ప్లస్ 1.46” AMOLED డిస్‌ప్లే, AoD, BT కాలింగ్, మెష్ స్ట్రాప్‌తో స్లీక్ మెటల్ ఫినిష్, 7 రోజుల బ్యాటరీ లైఫ్, 100+ వాచ్ ఫేస్‌లు & హెల్త్ సూట్ (గోల్డ్ లింక్)తో సరికొత్త OS
ఈ స్మార్ట్ వాచ్‌ను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4eFy51D
ఇవి కూడా చదవండి
Driving Viral Video”వామ్మో ఇదెక్కడి డ్రైవింగ్.. వీడియో వైరల్
Himalaya Products” హిమాలయ బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు..
Iqoo Phones” ఐక్యూ ఫోన్లపై భారీ తగ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడే కొనండి.. ఆన్‌లైన్‌లో
Up Car Accident” కారుతో గుద్ది.. స్కూటిని కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి.. షాకింగ్ వీడియో..
Pushpa-2 trailer” పుష్ఫ-2 ట్రయిలర్ లో లాంచ్‌లో ఉద్రిక్తత.. ప్రేక్షలపై లాఠీచార్జ్