వారెవ్వ‌.. ఈ కుర్చీ త‌యారీనే వేరు

టాలెంట్ ఎవ‌డి సొత్తుకాదు.. అవ‌స‌రమో ఆలోచనో కానీ మ‌నలో ఉన్న ప్ర‌తిభ అప్పడ‌ప్ప‌డు బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇటువంటి వారికి సోష‌ల్ మీడియాలో కొద‌వే ఉండదు. అటువంటిదే ఒక వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఓ బైక్ మెకానిక్ చిన్న‌పాటి కుర్చినే త‌యారు చేశాడు. ఇందులో వింతేమీ ఉందంటారా..? అక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్‌. సాధార‌ణంగా కుర్చీ త‌యారు చేయాలంటే చెక్క‌తోనే, ప్లాస్టిక్‌తోనే, లేక‌పోతే ఇనుముతోనే చేస్తారు. కానీ మ‌న మెకానిక్ మాత్రం ఏకంగా బైక్ పార్ట్‌ల‌తోనే ఈ కుర్చీ త‌యారు చేశాడు. డిస్క్ బ్రేక్, షాక్ అబ‌ర్జ్‌ర్వ‌ర్‌, బైక్‌కు ఉండే చిన్న చిన్న రాడ్‌లో కుర్చీని త‌యారు చేశాడు. ఏంచ‌క్కా దానిమీద కుర్చోని త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు. ముందుకు వెన‌క్కు ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ప‌ని చేస్తున్నాడు. మీరు ఓ లుక్కేయండి మ‌రి.

https://www.instagram.com/reel/Cv5x4N1AhdH/?igshid=MzRlODBiNWFlZA==

 

హలో ముంబై పోలీస్‌.. ఆ బ‌స్సుల‌పై ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను

మ‌రో కేబుల్ బ్రిడ్జి. ఎక్కడ అంటే

నువ్వు అత్త‌వా… కోడలి ప‌ట్ల ఇంత దారుణమా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *