తెలంగాణ ప్రజలకు మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన బ్రిడ్జితోపాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తెలంగాణ వాసులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో కేబుల్ బ్రిడ్జి కూడా అందుబాటులోకి రానుంది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 వరుసల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. దీని ద్వార ఆంద్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు ఈ రోడ్డు ఉండనుంది. ఈ రహదారి నిర్మాణం వల్ల హైదరాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ దూరం దాదాపు 50 కి.విూ. మేరకు తగ్గనుంది. ప్రస్తుతం ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం టెండర్ల దశలో ఉంది. ఏపీలో భూసేకరణ సమస్యల వల్ల ఈ రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతున్నప్పటికీ తెలంగాణలో టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో పనులు చేపట్టారు. కల్వకుర్తి టౌన్‌లోని జంక్షన్ నుంచి ప్రారంభమై నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, సోమశిలతోపాటు ఏపీలోని సంగమేశ్వరం, ఆత్మకూర్, వెలుగోడు విూదుగా నంద్యాల వరకు సాగే ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్ 167కేగా ప్రకటించింది. ఇది కల్వకుర్తి జంక్షన్ వద్ద ఎన్‌హెచ్ 765తో అనుసంధానమవుతుంది. మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించిన ఈ రోడ్డును రూ.3,382 కోట్లతో నిర్మించనున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో 87 కి.విూ. రోడ్డు నిర్మాణానికి రూ.887 కోట్లు వెచ్చించనున్నారు. రాష్ట్రంలో 7 మేజర్, 24 మైనర్ జంక్షన్ల గుండా సాగే ఈ రోడ్డపై 2 మేజర్, 33 మైనర్ బ్రిడ్జీలతోపాటు 4 అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు.
Check Also
Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వన్.. 40 శాతం తగ్గింపుతో.. కేవలం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు
ఇల్లు తుడించేందుకు ఉపయోగపడే స్పిన్ మాప్ పై అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ తగ్గుదల ప్రకటించింది. 40 శాతం తగ్గింపు …
Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవలం కేవలం రూ. 11499 కే..
Redmi LED Fire TV” రెడ్ ఎంఐ నుంచి 32 ఇంచుల టీవీ కేవలం రూ. 11,499 కే స్మార్ట్ …
Wooden Table Desk” రూ. 2నుంచి 3 వేల లోపు మంచి స్టడీ, ల్యాప్‌టాప్ టేబుల్.. ఇప్పుడే ఆర్డర్ చేయండి
Wooden Table Desk” పిల్లల చదువు కోసం కానీ లేదా ల్యాప్టాప్ కోసం తక్కువ ధరలో మంచి టేబుల్ కోసం …