Sunday , 15 December 2024
Breaking News

Malkajigiri MP Candidate” మల్కాజిగిరి ఎంపీ స్థానానికి బిఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన

Malkajigiri MP Candidate”  హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల హడావిడి జోరందుకుంది. ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే పార్టీలు ఆయా స్థానాలకు (Malkajigiri MP Candidate) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలవుతుందన్న వార్తల నేపథ్యంలో.. బహిరంగ సభలు నిర్వహించటమే కాకుండా, మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో పార్టీలు పడ్డాయి. ఈ క్రమంలోనే.. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కూడా మల్కాజిగిరి స్థానానికి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న శంభీపూర్‌ రాజును మల్కాజ్‌ గిరి నుంచి బరిలోకి దించూతూ.. గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఉత్కంఠకు తెర దించారు. గత కొంత కాలంగా మల్కాజ్‌ గిరి ఎంపీ సీటును ఆశించిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించటంతో కేసీఆర్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఉన్న (Malkajigiri MP Candidate) మల్కాజ్‌గిరిపై అన్ని పార్టీలు ఫోకస్‌ చేశాయి. అయితే.. గతంలో ఆ స్థానంలో ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి ఎంపీగా ఉండగా.. ఇప్పుడు ఎవర్ని బరిలోకి దించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. మరోవైపు.. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పోటీలో దించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి రెండో సారి మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలవగా.. (Malkajigiri MP Candidate) మల్కాజ్‌ గిరి ఎంపీ స్థానాన్ని కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌ను, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దించే అభ్యర్థులిద్దరినీ.. ఓడించాలని కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎమ్మెల్సీగా ఉన్న యువకుడైన శంభీపూర్‌ రాజును బరిలోకి దించి.. గట్టి పోటీ ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అయితే.. ఉధ్యమకారుడైన శంభీపూర్‌ రాజు 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతుండగా.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కార్యకర్త నుంచి ఎమ్మెల్సీ వరకు ఎన్నో పదవుల్లో పని చేశారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన రాజుకు.. మేడ్చల్‌- మల్కాజ్‌ గిరి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో పాటు మల్లారెడ్డి కూడా సపోర్ట్‌ చేయటంతో.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వొచ్చని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 

Kcr Meeting” కరెంట్‌ పోకుండా కరెంట్‌ ఇచ్చిన ఘనత మాదే కేసీఆర్‌

Ts Rtc Md” మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!? ఆర్టీసీ ఎండీ ట్వీట్

Indiramma House Scheme” ఇందిరమ్మ ఇండ్ల ప‌థ‌కం ప్రారంభం.. నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని ఇండ్లంటే..

Ts Rtc Electric buses” 25 ఎల‌క్ట్రిక్ నాన్ ఏసీ బ‌స్సులు ప్రారంభం

About Dc Telugu

Check Also

15.12.2024 Dc. Telugu Cinema

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని సుడా చైర్మెన్ కోమ‌టిరెడ్డి న‌రేంద‌ర్ రెడ్డి …

HONOR 5G Phones

HONOR 5G Phones” హాన‌ర్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. 16 వ తేది వ‌ర‌కే త‌గ్గింపు

HONOR 5G Phones”  మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే హాన‌ర్ ఫోన్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. అతి త‌క్కువ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com