Helicopter accident” ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన సీమెన్స్ సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన తోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందారు.
న్యూయార్క్ నగరాన్ని చూడటానికి బయలుదేరిన టూరిస్ట్ హెలికాప్టర్ హడ్సన్ నదిలో పడిపోయింది. అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య మెర్స్ కాంప్రూబి మోంటల్ మరియు వారి ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ ప్రమాదంలో పైలెట్ కూడా మృతి చెందారు. అయితే మృతి చెందిన అగస్టిన్ ఎస్కోబార్ 2022 నవంబర్ లో సిమెన్స్ స్పెయిన్ కంపెనీ సీఈవో గా నియమితులయ్యారు. యూరోపియన్ టెక్ దిగ్గజం కంపెనీల్లో ఇది ఒక్కటి. ఆయన దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ కంపెనీలో ఉన్నారు. అయితే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురవడానికి కారణం ఒక నట్టుగా తేల్చారు. ఈ నట్టే కీలక భాగం ఊడిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నట్టు హెలికాప్టర్‌కు ఉండే రోటర్ ను దాని మాస్ట్ కు కలిపి ఉంచుతుంది. హెలికాప్టర్ గాలిలో ఉండగానే ఈ నట్టు ఊడిపోయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. అందుకే హెలికాప్టర్ రోటర్ ఊడిపోయిందని భావిస్తున్నారు. హెలికాప్టర్ బ్లేడ్లు వేగంగా తిరుగుతూ కిందపడిన విజవల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి నిబంధనల ప్రకారం హెలికాప్టర్ గాల్లోకి లేచే ముందు ఈ నట్టును చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రమాదానికి ముందు ఈ చెక్ చేయలేదని తెలుస్తున్నది. ఈ హెలికాప్టర్ మొత్తంగా 12వేల గంటలు గాల్లో తిరిగినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో దానికి చాలా రిపేర్స్ చేయాల్సి ఉన్నదని అక్కడి అధికారులు గుర్తించారు. ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్న రోజు వరుసుగా 8వ సారి ప్రయాణం సాగించినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలొచ్చాయి..
మరిన్ని కథనాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00
Nasa” ఒక్క ఐడియా చెప్పండి.. రూ. 25 కోట్లు అందుకోండి..
China Bridge”ఇంతకు ముందు గంట ప్రయాణం.. ఇప్పుడు నిమిషంలోనే చేరుకోవచ్చు
New Airport”ఈ ఏయిర్పోర్ట్ ఇప్పటిది కాదు… స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ఏర్పాటు..
The crashed plane” గాల్లో పల్టీలు కొడుతూ కులిన విమానం… వీడియో వైరల్
Current Affairs”బొంగో సాగర్ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి.. ? పోటీ పరీక్షల ప్రత్యేకం
The crashed plane” గాల్లో పల్టీలు కొడుతూ కులిన విమానం… వీడియో వైరల్
