Wednesday , 12 March 2025
Breaking News
Cinema news

Cinema News” నిన్న‌టి నుంచి ట్రెండింగ్‌.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ఫ్యాన్స్‌ తలచుకుంటే ట్రెండింగ్‌కి కొదవా అన్నట్టుంది పరిస్థితి. నిన్నటి నుంచి ఏక్‌ధమ్‌ ట్రెండ్‌ అవుతూనే ఉన్నారు జాన్వీ కపూర్‌. ఇంతగా ట్రెండ్‌ కావడానికి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ మాత్రమే రీజనా.. అంటే.. అదేంటి గురూ అలా అంటున్నారు.. నెక్స్ట్‌ టాలీవుడ్‌ని ఏలేది ఆ అమ్మాయే అని అంటున్నారు ఫ్యాన్స్‌. చుట్టమల్లే చుట్టేసింది మన జాన్వీ కపూర్‌. మొన్న మొన్నటిదాకా బాలీవుడ్‌కే పరిమితమైనా.. ఏనాడూ ఆమెని పొరుగమ్మాయిలా చూడలేదు మనవాళ్లు. ఆ మాటలు విన్న శ్రీదేవి తనయ దేవరతో ఎంట్రీ ఇస్తే సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. దేవర సెకండ్‌ పార్టు కోసం ఆల్రెడీ 2026లో కాల్షీట్‌ కేటాయించేశారు ఈ బ్యూటీ. ఇప్పుడు మాత్రం రామ్‌చరణ్‌ సినిమా షూటింగ్‌తో యమా బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన జాన్వీ లుక్‌ అదిరిందంటున్నారు అభిమానులు. ఆర్సీ 16 షూట్‌ కంప్లీట్‌ కాగానే అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా యూనిట్‌తో జాయిన్‌ అవుతారట శ్రీదేవి తనయ. ఐకాన్‌ స్టార్‌ పక్కన అద్భుతమైన రోల్‌ కుదిరిందంటూ హ్యాపీగా ఉన్నారట జాన్వీ. డ్యాన్సుల్లో బన్నీని ఈక్వెల్‌ చేయడానికి ఇప్పటి నుంచే కాసింత స్పెషల్‌గా శ్రద్ధ పెడుతున్నారట. తెలుగులో ఒకటికి మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి జాన్వీకి. ముగ్గురు లీడింగ్‌ హీరోల మూవీస్‌లో చేస్తున్నారు. సో, అడపాదడపా బాలీవుడ్‌ మూవీస్‌ చేసినా, ఫుల్‌ టైమ్‌ తెలుగుకే అలాట్‌ చేసేయాలని ఫిక్స్‌ అయిపోయినట్టున్నారు సిల్వర్‌స్క్రీన్‌ తంగం.

 

Integrated BED” ఇంట‌ర్ త‌ర్వాత.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోసం ఎలా అప్ల‌య్ చేయాలంటే..?

Smart Phone” ఐక్యూ 12 5జీ లెజెండ్ స్మార్ట్ ఫోన్‌… 256 స్టోరేజీతో..

10Th Hall tickets”పదో త‌ర‌గతి హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి.. ఎలా డౌన్లోడ్ చేయాలంటే.. హాల్ టిక్కెట్ పొందండి..

Amazon Offer” ఎల‌క్ట్రిక్ లైట‌ర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాల‌ను కూడా

Bank jobs”బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI) అప్రెంటిస్ 400 పోస్టులకు రిక్రూట్‌మెంట్

About Dc Telugu

Check Also

Mankondur”మృతుడి భార్యకు గాయత్రి బ్యాంక్ చెక్కు అందజేత..

Mankondur” చెక్కు అందజేసిన ఎమ్మెల్యే… శంకరపట్నం డిసీ ప్రతినిధి రోడ్డు ప్రమాదంలో మరణించిన కరీంనగర్ గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడు కెన్నరసారం …

Peddapalli” 436 రూపాయల ప్రీమియం తో 2 లక్షల బీమా: పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

Peddapalli”  పి.ఎం.జే.జే.బి.వై పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పి.ఎం.జే.జే.బి.వై పథకం క్రింద 2 లక్షల రూపాయల బీమా చెక్కును పంపిణీ …

RedMi” రెడ్ మీబొనంజా ఆఫ‌ర్‌… త‌క్కువ ధ‌ర‌ల్లోనే స్మార్ట్ ఫోన్స్‌

RedMi”  రెడ్ మీ 14 సీ 5 జీ స్టార్ గేజ్ బ్లాక్ ₹9,999 రెడ్ మీ 14 సీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com