Cinema News” శ్రీ‌లీల గురించి ఇవి తెలుసా…

Cinema news

Cinema News”  వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజిబిజీగా ఉంటున్న శ్రీ‌లీల గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుందాం.. శ్రీ లీల ప్రధానంగా తెలుగు, కన్నడ మూవీల్లో క‌థ‌నాయిక‌గా నటిస్తుంది. శ్రీ‌లీల 2017లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను మొద‌లు పెట్టింది. కన్నడ కిస్‌తో పాటు తెలుగులో పెళ్లి సందడి, ధమాకా వంటి చిత్రాలతో ఈ బ్యూటీ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో ఉత్తమ నటిగా అవార్డును కూడా గెలుచుకుంది. తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉన్నది.

శ్రీ‌లీల డెట్రాయిట్‌ లోని మిచిగాన్‌ లో ఒక తెలుగు కుటుంబంలో 2001 జూన్‌ 14 న జన్మించింది. కానీ . బెంగుళూరులో పెరిగింది. ఆమె తల్లి పేర స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్ విధులు నిర్వ‌ర్తిస్తోంది. శ్రీ‌లీల చిన్న‌గున్న‌ప్పుడే ఐదేండ్ల వయసులో భరతనాట్యంలో శిక్షణ మొద‌లు పెట్టింది. శ్రీ‌లీల కూడా డాక్టర్‌ కావాలనుకుంది. కానీ సినీ ఇండ‌స్ట్రీలో రంగ ప్ర‌వేశం చేసింది. 2017వ సంవ‌త్స‌రంలో చిత్రాంగద అనే తెలుగు హారర్ చిత్రంతో అభిమానుల ముందుకొచ్చింది. ఈ చిత్ర‌లో ప్రధాన పాత్రలో కనిపించిన సింధు తోలాని తో చిన్నప్పటి పాత్రలో క‌న‌ప‌డింది. ఆ తర్వాత కిస్‌ అనే కన్నడ సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా న‌టించింది. పెళ్లి సందడి సినిమాతో 2021లో తెలుగు సినిమాలో హీరోయిన్‌గా తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఈమె నటనకి సైమా వైదికపై మోస్ట్‌ ప్రామిసింగ్‌ న్యూకమర్‌ అవార్డు అందింది. ఈ తర్వాత సినిమా ధమాకాలో క‌థ‌నాయిక‌గా నటించి బ్లాక్‌ బ్లాక్‌ బస్టర్ హిట్టు కొట్టింది. ఈ సినిమా కూడా సైమా ద్వారా ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో న‌టించింది. 2023లో భగవంత్‌ కేసరి, ఆదికేశవ, స్కంద, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో భగవంత్‌ కేసరి మాత్రమే ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. 2024లో గుంటూరు కారం సినిమాలో నటించినప్ప‌టికీ అది ఆశించిన ఫలితాన్ని రాబ‌ట్ట‌లేపోయింది. అదే సంవ‌త్స‌రం పుష్పా – 2లో స్పెషల్‌ సాంగ్‌ చేసి ప్రేక్ష‌కుల‌ను ఉర్రుత‌లూగించింది. ప్రస్తుతం నితిన్‌ సరసన రాబిన్ హుడ్‌, రవితేజకి జోడిగా మాస్‌ జాతర, పవన్‌ కళ్యాణ్‌ పక్కన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌ హీరోగా వస్తున్న పరాశక్తిలో హీరోయిన్గ‌గా నటిస్తుంది. వీటితో పాటు హిందీలో ఓ సినిమాకి సైన్‌ చేసింది.

Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వ‌స్తున్నాం..

Vijayashanthi” కీలక పాత్రలో విజయశాంతి

Cinema News” టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న సోనాక్షి..?

Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త

Smart TV” చ‌వ‌కాలో టీవీ కొనాల‌నుకుంటున్నారా..? ఏఐ విజ‌న్‌తో 40 ఇంచుల జేవీసిని చూడండి…

Petrol” ఆ వాహ‌నాల‌కు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు

Petrol” ఆ వాహ‌నాల‌కు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *