Thursday , 26 December 2024

జాబిల‌మ్మ‌కు మ‌రింత చేరువ

కీలక ఘట్టంలో చంద్రయాన్‌
చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశించిన మాడ్యూల్‌
భార‌త అంత‌రిక్ష సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. బుధవారం ఫైరిగ్‌ ను విజయవంతంగా చేయడం ద్వారా.. చంద్రయాన్‌-3ని 153 బై 163 కిలోవిూటర్ల ఆర్బిట్‌ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక అయిపోయిందన్నమాట. వివ‌రంగా చెప్పాలంటే చంద్రయాన్‌-3 అనే యాత్ర పూర్తి చేసుకున్న ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆగస్ట్‌ 17న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ వేరు పడుతుంది. ఇలా విడివ‌డిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆగస్ట్‌ 23న చంద్రుడిపై మెల్లగా ల్యాండ్‌ అయితే చంద్రయాన్‌-3 మిషన్ స‌క్సెస్ అయిన‌ట్టే భావిస్తారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్ట్‌ 23న అది ల్యాండ్‌ అవుతుంది. ప్రయోగం విజయవంతమో కాదో తేలడానికి ఇదే కీలకం. క్షేమంగా ల్యాండ్‌ అయితే ప్రయోగం సక్సెస్ అయిన‌ట్టు. 2019లో చంద్రయాన్‌-2 చంద్రుని ఉపరితలంపై సాప్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రధాన మిషన్‌ విఫలమడంతో శాష్తవ్రేత్తలు చంద్రయాన-3కి శ్రీకారం చుట్టారు.చంద్రయాన్‌-1 మిషన్‌ సమయంలో ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది. ఆగష్టు 29, 2009న అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్‌ కోల్పోవడంతో మిషన్‌ ముగిసింది. తాజాగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) చైర్మన్‌ సోమనాథ్‌ గత వారం చంద్రయాన్‌ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని, ఆగస్ట్‌ 23న చంద్రునిపై ల్యాండింగ్‌ చేసేందుకు వరకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామన్నారు.

About Dc Telugu

Check Also

Earbuds

Earbuds” కొత్త ఇయ‌ర్ బడ్స్ జ‌స్ట్ 699 రూపాయ‌ల‌కే

Earbuds” పెద్ద ప్లేటైమ్‌తో క్రాటోస్ క్యూబ్ ఇయర్‌బడ్‌లు, నాయిస్ ఐసోలేషన్ & క్లియర్ కాల్స్, వాయిస్ అసిస్టెంట్‌తో బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, …

Smart Phones

Smart Phones” హాలిడే ఫోన్ ఫెస్ట్.. సేల్ జనవరి 2 వరకు లైవ్‌లో ఉంది

Smart Phones” బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ⚡️ 40% వరకు తగ్గింపు ఆఫర్‌లను అన్వేషించండి  లింక్ ను క్లిక్ చేయండి …

LG

LG Smart LED TV” ఎల్ జీ స్మార్ట్ టీవీ త‌క్కువ ధ‌ర‌లో.. వివ‌రాలు చూడండి

త‌క్కువ ధ‌ర‌లో బ్రాండెడ్ టీవీ కొనాల‌నుకుంటున్నారా..? ఎల్ జీ కంపెనీ అందిస్తున్న‌ది. ఈ టీవీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 32 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com