నిజామాబాద్ ః మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోదన్ పట్టణంలో గల ఎన్ ఎస్ ఎఫ్ గ్రౌండ్‌లో బీఆ ర్ ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని కొనియాడారు. గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు మరోసారి చూపించారని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. బోధన్‌లో ని 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. బోధన్‌లో ఉన్నా 152 చెరువులను మంచిగా చేసుకున్నామని తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి ఐటీ హబ్ తీసుకొచ్చామని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు తీసుకొస్తామని హామి ఇచ్చారు. గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నిసామని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్టాల్ల్రో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా అని పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. రైతును రాజుగా చేసే పక్రియ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు.
Check Also
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి …
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు
HONOR 5G Phones” మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే హానర్ ఫోన్లను ఒకసారి పరిశీలించండి. అతి తక్కువ …