జాబిల‌మ్మ‌కు మ‌రింత చేరువ

కీలక ఘట్టంలో చంద్రయాన్‌
చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశించిన మాడ్యూల్‌
భార‌త అంత‌రిక్ష సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. బుధవారం ఫైరిగ్‌ ను విజయవంతంగా చేయడం ద్వారా.. చంద్రయాన్‌-3ని 153 బై 163 కిలోవిూటర్ల ఆర్బిట్‌ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక అయిపోయిందన్నమాట. వివ‌రంగా చెప్పాలంటే చంద్రయాన్‌-3 అనే యాత్ర పూర్తి చేసుకున్న ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆగస్ట్‌ 17న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ వేరు పడుతుంది. ఇలా విడివ‌డిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆగస్ట్‌ 23న చంద్రుడిపై మెల్లగా ల్యాండ్‌ అయితే చంద్రయాన్‌-3 మిషన్ స‌క్సెస్ అయిన‌ట్టే భావిస్తారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్ట్‌ 23న అది ల్యాండ్‌ అవుతుంది. ప్రయోగం విజయవంతమో కాదో తేలడానికి ఇదే కీలకం. క్షేమంగా ల్యాండ్‌ అయితే ప్రయోగం సక్సెస్ అయిన‌ట్టు. 2019లో చంద్రయాన్‌-2 చంద్రుని ఉపరితలంపై సాప్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రధాన మిషన్‌ విఫలమడంతో శాష్తవ్రేత్తలు చంద్రయాన-3కి శ్రీకారం చుట్టారు.చంద్రయాన్‌-1 మిషన్‌ సమయంలో ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది. ఆగష్టు 29, 2009న అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్‌ కోల్పోవడంతో మిషన్‌ ముగిసింది. తాజాగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) చైర్మన్‌ సోమనాథ్‌ గత వారం చంద్రయాన్‌ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని, ఆగస్ట్‌ 23న చంద్రునిపై ల్యాండింగ్‌ చేసేందుకు వరకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *