Sunday , 15 December 2024
Breaking News

ఆదివారం ఉద‌యం 8గంట‌ల నుండి కౌంటింగ్ ప్రారంభం..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం నాడు ప్రశాంతంగా ముగిసింద‌ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ చెప్పారు. ఎక్కడా రీపోలింగ్‌ అవకాశాలు లేవని స్ప‌ష్టం చేశారు. డిసెంబ‌ర్ 3న నిర్వ‌హించే ఓట్ల లెక్కింపు పక్రియ కోసం జిల్లా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని వికాస్‌ రాజ్ చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత కొసాగుతోందన్నారు. మొత్తం 49 కౌంటింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తొలుత లెక్కిస్తారని, ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని చెప్పారు. గురువారం జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి వికాస్‌రాజ్‌ హైదరాబాద్‌లో విూడియా సమావేశం లో వెల్లడించారు.ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలతో పాటు భారీ భద్రత కల్పించినట్లు సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉందని, ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకూ ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించినట్లు చెప్పారు. 40 కంపెనీల కేంద్ర బలగాలు భద్రత విధుల్లో ఉన్నట్లు వివరించారు. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్‌, ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతం కంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2018లో 2,400 కేసులు ఉంటే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కవగా నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 70.74 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో పోలింగ్‌ 3 శాతం తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో లక్షా 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని, 80 ఏండ్లు పైబడిన వారికి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించామని అన్నారు. ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం, హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. ఇక నియోజక వర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్‌పురాలో 39.6 శాతం పోలింగ్‌ నమోదైందని వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. చాలా చోట్ల రాత్రి 9.30 వరకు పోలింగ్‌ జరిగిందని తెలిపారు. ఈసారి ఓటర్లలో 18, 19 ఏండ్ల వయసున్న వారు 3.06 శాతం ఉన్నారన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలోని 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. ఓట్‌ ఫ్రం హోం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తెలంగాణలో ఎక్కడా రీపోలింగ్‌ కు అవకాశమే లేదు.’ అని సీఈవో వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 1.80 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించు కున్నారని, 80 ఏళ్లు పైబడిన వారికి ఓట్‌ ఫ్రం హోం అవకాశం ఇచ్చామని వివరించారు. ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 18 – 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. థర్డ్‌ జెండర్స్‌ కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని చెప్పారు. 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, 7,591 కేంద్రాల వెలుపల సీసీ టీవీ సదుపాయం కల్పించినట్లు వివరించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఎవరి ధీమా వారిదే .. 3 వ‌ర‌కు టెన్ష‌న్

4న తెలంగాణ కేబినేట్‌ భేటీ :కేడ‌ర్‌లో విశ్వాసం నింపడానికే అన్న ప్రచారం

ప్ర‌శాతంగా నిద్ర‌పోయాను.. కేటీఆర్ ట్వీట్

About Dc Telugu

Check Also

15.12.2024 Dc. Telugu Cinema

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని సుడా చైర్మెన్ కోమ‌టిరెడ్డి న‌రేంద‌ర్ రెడ్డి …

HONOR 5G Phones

HONOR 5G Phones” హాన‌ర్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. 16 వ తేది వ‌ర‌కే త‌గ్గింపు

HONOR 5G Phones”  మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే హాన‌ర్ ఫోన్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. అతి త‌క్కువ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com