Friday , 13 September 2024
Breaking News

ఆ హీరోయిన్‌కు పెండ్లి అయ్యింద‌టా.. అదుపులేని పుకార్లు

సినిమా ఇండ‌స్ట్రీలో ఏం జ‌రిగినా అంద‌రికీ ఇంట్ర‌స్టే.. అందునా హీరోయిన్ల జీవితంపై మ‌రీ ఎక్కువ. వాళ్ల వ్య‌క్తి గ‌త జీవితంలో తొంగిచూస్తున్నారు. తొంగిచూసినా ప‌ర‌వాలేదు కానీ ఉన్న‌వి లేనివి జోడించి పుకార్లు పుట్టిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో లైక్‌ల కోసం, వ్యూస్ కోసం క‌ట్టు క‌థ‌లు అల్లి ప్ర‌చారం చేస్తున్నారు. సినిమా హీరో,హీరోయిన్ల పెండ్లిళ్ల‌పై చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎవ‌రికి తోచిన క‌థ‌లు వాళ్లు అల్లుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇటువంటివి ఎక్కువైపోయాయి. పెండ్లి వ‌యస్సున్న సెలబ్రిటీలు త్వ‌ర‌లో ఒక్క‌టి కానున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలా ఒక్కిరికి ఒక్కోసారి కాదు అనేక సార్లు ల‌గ్గాలు చేస్తున్నారు.

తాజాగా సాయిప‌ల్లవి విష‌యంలో..
ఫిదా సినిమాతో ఫేమ‌స్ అయిన సాయి ప‌ల్ల‌విపై ఈ మ‌ధ్య‌కాలంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. పెళ్లి రూమ‌ర్స్‌తో వ‌దిలిపెట్ట‌కుండా ఏకంగా పెండ్లి తంతు పూర్త‌యిన‌ట్టు ఒక ఫొటో ఒక‌టి వైర‌ల్ అయ్యింది. ఓ సినిమా ప్రారంభంలో త‌మిళ సాంప్ర‌దాయం ప్రకారం పూల దండ‌లు వేసుకుని ఫొటోల‌కు దిగారు. అందులో పల్లవి – డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ మాత్రమే కనిపించేలా ఎడిట్‌ చేసి, వారిద్దరికీ పెళ్లి అయిపోయిందని కొందరు ప్రచారం చేశారు. ఈ రూమ‌ర్స్‌ను సాయిప‌ల్ల‌వి అస‌లు ప‌ట్టించుకోలేదు. కానీ ట్విట్ట‌ర్ వేదిక‌గా పెండ్లి వార్తలపై ట్విట్టర్‌ వేదికగా స్ప‌ష్టం చేసింది. ఇటువంటి పుకార్ల‌కు రూమ‌ర్స్ వివ‌ర‌ణ‌లు ఇవ్వాల్సి రావ‌డం చాలా నిరుత్స‌హ‌ప‌రిచింద‌ని పేర్కొన్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా కావాల‌ని ఇలా ఇబ్బంది పెట్ట‌డం పై స‌రికాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మ‌రో ఫేమ‌స్ హీరోయిన్ కీర్తి సురేష్‌పైనా…

మరో ఫేమ‌స్ హీరోయిన్‌ కీర్తి సురేష్ పైనా పెళ్లిపై చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య దుబాయికి చెందిన బిజినెస్ మ్యాన్‌తో కీర్తి ప్రేమ‌లో మునిగితేలినట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో కీర్తి సురేష్ అత‌ను ఫ్రెండ్ మాత్ర‌మే క్లారిటీ ఇచ్చింది. అంతకముందు మలయాళీ వ్యాపారవేత్తతో మ్యారేజ్ సెట్ అయిన‌ట్టు క‌థ‌లు అల్లారు. వీట‌న్నింట‌పై కీర్తి ఖండించింది. అనిరుధ్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. ఆమె తండ్రి సురేష్‌ కుమార్‌ కూడా కీర్తి – అనిరుధ్‌ పై వస్తున్న వార్తలపై
స్పందించారు. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లని క్లారిటీ ఇచ్చారు.

అల‌నాటి స్టార్‌పై..

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌ త్వరలోనే వివాహం చేసుకోబోతోందంటూ వార్తలు పుకార్లుగా నేటికీ షికారు చేస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో గత కొద్దిరోజులుగా రిలేషన్‌ షిప్‌ లో ఉందని.. ఇప్పుడు ఏడు అడుగులు నడవడానికి రెడీ అయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది త్రిష దృష్టికి చేరడంతో, సోషల్‌ విూడియా వేదికగా రూమర్స్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది. ఇలాంటి పుకార్లు పుట్టించొద్దని ట్వీట్‌ చేసింది. నిజానికి గతంలోనూ త్రిష మ్యారేజ్‌ పై అనేకసార్లు రూమర్స్‌ వచ్చాయి. 2015లో వరుణ్‌ మానియన్‌ అనే బిజినెస్‌ మ్యాన్‌ తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఎందుకో తెలియదు కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. అగ్ర కథానాయిక అనుష్క పెళ్లి గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. 40 ఏళ్ళు దాటినా వివాహ బంధంలో అడుగుపెట్టకపోవడంతో, పుకార్లు ఇంకా ఎక్కువై పోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ అంటే నాకు ఇష్టమే.. కానీ ఆ టైం ఇంకా రావడం లేదని చెప్పింది.

చ‌దవండి ఇవి కూడా

చెరువులో ప‌డి న‌లుగురు మృతి

రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్‌ వంతెన మూసివేత

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video” అదిరంద‌య్యా.. లేటెస్ట్ గుర్ర‌పు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైర‌ల్‌

Viral Video”   ద్విచ‌క్ర‌వాహ‌నాలు, ఆటోలు, జీపులు రాక‌ముందు మ‌నుషులు ర‌వాణా కోసం గుర్ర‌పు బండ్ల‌ను ఉప‌యోగించారు. సాంకేతిక‌త పెరిగినంకా గుర్ర‌పు …

Xiaomi Power Bank

Xiaomi Power Bank” మీరు మంచి ప‌వ‌ర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం త‌గ్గింపుతో.. జియోమీ ప‌వ‌ర్ బ్యాంక్

Xiaomi Power Bank” ఫోన్ అవ‌స‌రాలు ఎక్కువ‌గా ఉన్నవారు మంచి ప‌వ‌ర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …

Xiaomi Tv

Xiaomi Tv” 42999 రూపాయ‌ల విల‌గ‌ల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివ‌రి రోజు

Xiaomi Tv” ప్ర‌స్తుతం అమెజాన్‌లో ఎల‌క్ట్రానిక్ ఫెస్టివ్ సేల్ న‌డుస్తోంది. ఎన్నో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై భారీ త‌గ్గింపు ప్ర‌క‌టించింది. మీరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com