ర్యాష్‌ డ్రైవింగ్‌..మహిళ మృతి సీసీ కెమెరాల్లో వీడియో

అతివేగంగా వ‌చ్చిన కారు మ‌హిళ‌ను ఢీ కొట్ట‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘ‌ట‌న వరంగల్ జిల్లాలో గురువారం చోటు చేసుకుది. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. హన్మకొండ జిల్లాలోని కాజీపేట లో ఈ ప్రమాదం జ‌రిగింది. స్థానిక సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ దగ్గర కవిత అనే మహిళ బైక్‌ ఎక్కబోతుండగా, స్విప్ట్‌ డిజైర్‌ కారు అతి వేగంతో దూసుకొచ్చి కవితను గుద్దేసింది. ఓటు వేయడం కోసం దంపతులు ఆ ప్రాంతానికి వచ్చి తిరిగి బైక్‌ పై వెళ్లాలని ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగింది. నిందితుడు తన కారును రాంగ్‌ సైడ్‌లో ఓ బైక్‌ను ఓవర్‌ టేక్‌ చేయబోయినట్లుగా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన వీడియోను బట్టి తెలుస్తుంది. అదే సమయంలో రోడ్డు పక్కనే తన భర్త బైక్‌ ఎక్కబోతున్న కవితను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.

 

ఆదివారం ఉద‌యం 8గంట‌ల నుండి కౌంటింగ్ ప్రారంభం..

ఎవరి ధీమా వారిదే .. 3 వ‌ర‌కు టెన్ష‌న్

మీక‌ష్టం.. మీ శ్ర‌మ వృథా కాలేదు రేవంత్ రెడ్డి ఆసక్తిక‌ర ట్వీట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *