మరో పక్షం రోజుల్లో క్రికెట్ సందడి మొదలు కానుంది. భారత్‌లో ప్రపంచ కప్ వేడి అందుకుంటోంది. అన్ని దేశాలూ ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించేశాయి. మరో వారం రోజుల్లో 15 మందితో కూడిన టీమ్ లనూ వెల్లడించనున్నాయి. ఆ తర్వాత వీరిలో ఎవరైనా గాయపడితే తప్ప మార్పులకు అవకాశం ఉండదు. మరోవైపు ఈసారి కప్ నకు ఉన్న ప్రత్యేకత ఏమంటే.. కేవలం భారత్ మాత్రమే ఆతిథ్యం ఇవ్వనుండడం. వాస్తవానికి 1987, 1996, 2011లోనూ మన దేశంలో ప్రపంచ కప్ జరిగింది. కానీ, అప్పుడు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లను భాగస్వాములను చేసుకుంది. ఈసారి ఒంటరిగా నిర్వహిస్తోంది. 1975లో ప్రపంచ కప్ మొదలుకాగా.. 2011 వరకు ఆతిథ్య దేశం కప్ గెలవలేదు. 1979, 83లో ఇంగ్లండ్ లో జరిగిన కప్ లను వెస్టిండీస్ (2), భారత్ (1) గెలుచుకున్నాయి. 1987లో భారత్-పాక్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వగా ఆస్టేల్రియా విజేతగా ఆవిర్భవించింది. 1992లో ఆస్టేల్రియా-న్యూజిలాండ్ లో జరిగిన కప్ లో పాకిస్థాన్ తొలిసారి చాంపియన్ అయింది. 1996లో భారత్-పాక్ తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇచ్చినా అది మూడు మ్యాచ్ లకే పరిమితం. ఈ కప్ ను లంకనే గెలిచింది. కానీ, ఆతిథ్య జట్టు హోదా ఇవ్వలేని పరిస్థితి. 1999లో ఇంగ్లండ్ కు, 2003లో దక్షిణాఫ్రికాకు, 2007లో వెస్టిండీస్ కు ఆతిథ్యం దక్కినా కప్ మాత్రం అందలేదు. అయితే, ఈ ఆనవాయితీకి 2011లో బ్రేక్ పడింది. నాటి కప్ ను భారత్ ఎగురేసుకుపోయింది. ధోనీ సారథ్యంలో కప్ గెలిచాం. ఇప్పుడు రనోహిత్ శర్మ కూడా మంచి ఊపులో ఉన్నాడు. అప్పటినుంచి అదే సంప్రదాయం 2015 ప్రపంచ కప్ ను ఆస్టేల్రియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించగా ఆసీస్ గెలిచింది. 2019లో ఇంగ్లండ్-వేల్స్ బోర్డులు ఆతిథ్యం ఇవ్వగా ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచ కప్ కొట్టింది. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. అందులోనూ ఒంటిచేత్తో నిర్వహణ బాధ్యతలు నిర్వహించనుండడం, గతంలో కంటే జట్టు మెరుగ్గా ఉండడంతో రోహిత్ సేన ప్రపంచ కప్ తెస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. మనం బలంగానే.. మిగతా జట్లూ టీమిండియా ప్రపంచ కప్ జట్టు బలంగానే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 2019 నాటి నాలుగో నంబరు బలహీనతను అధిగమిచింది. కేఎల్ రాహుల్ కోలుకుని తిరిగి రావడమే కాక.. ఆసియా కప్ లో రాణించి నాలుగో నంబరు స్థానంపై బెంగ తీర్చాడు. మరో ముఖ్యమైన అంశం.. పేసర్ జస్పీత్ర్ బుమ్రా. ఏడాది తర్వాతి తిరిగి జట్టులోకి వచ్చిన అతడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లకు రోహిత్, కోహ్లి వంటి సీనియర్లు అండగా ఉంటే చాలు. నాలుగేళ్ల నుంచి మరింత మెరుగైన రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండ్ నైపుణ్యం జట్టుకు ప్లస్ పాయింట్. ఈ సారి ప్రపంచ కప్ లో టీమిండియా తురుపుముక్క హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్. ఆసియా కప్ ఫైనల్లో అతడి బౌలింగ్ చూశాక ఎవరైనా ఇదే మాట అంటారు. అందులోనూ సొంతగడ్డపై జరగనున్న మ్యాచ్ లలో సిరాజ్ ఇంకెలాంటి ప్రదర్శన చేస్తాడో అన్న భారీ అంచనాలున్నాయి. మరోవైపు ఏడాదిగా సిరాజ్ అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. అందుకే అతడిపై అంతగా అంచనాలు పెట్టుకున్నారు. సిరాజ్ ఊపు చూస్తుంటే వీటిని నెరవేర్చేలాగే నిపిస్తున్నాడు.మొత్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. సమయం కూడా కలసి వస్తే కప్పు మనదే.
ఇక ‘సున్నా’ మార్కులొచ్చినా పీజీ సీటు