Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంత‌లోనే ఘోర ప్ర‌మాదం..

Jagityal Car accident” ఆనందంగా పెండ్లికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా 5 నిమిషాల్లోనే ఇంటికి చేరుతార‌న‌గా ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో యువ‌కుడు, యువ‌తి మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న జగిత్యాల జిల్లాలో ఆదివారం తెల్ల‌వారు జామున‌ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడ‌కు చెందిన సంకీర్త్ అనే యువకుడు, మ‌రో యువ‌తి, రాయ‌మ‌ల్లు అనే వ్య‌క్తి, అత‌ని భార్య జ‌న‌గామ జిల్ల‌లోని ఓ వివాహ రిసెప్ష‌న్ కు హాజ‌రై తిరిగి ఇంటి వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప‌ట్ట‌ణంలోని ధ‌రూరు కెనాల్ వ‌ద్ద‌కు రాగానే కారు ఎదురుగా వ‌స్తున్న బ‌స్సును అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో సంకీర్త్ ఆయ‌న ప‌క్కన ఉన్న యువ‌తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. రాయ‌మ‌ల్లు ఆయ‌న భార్య‌కు తీవ్ర‌గాయాలయ్యాయి. వీరిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తెల్ల‌వారు జామున 4.30గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌రో ఐదు నిమిషాలు అయితే వీరంతా వారి ఇంటికి చేరుకునే వారు.

 

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

అలాంటి సినిమాలు చేయ‌ను స‌మంత‌10.11.2024 D.C Telugu Cinema

Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

Sea Plane” నీటి విమానం.. రేపే ప్రారంభం.. ట్రయిల్ రన్ వీడియో..

Delhi News” మ‌హిళ‌పై ఎద్దు ఘోర దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న మ‌హిళ‌వీడియో వైర‌ల్

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *