Sabarimala Special trains” శబరిమలకు స్పెష‌ల్ రైళ్లు

Sabarimala Special” గుంతకల్లు డివిజన్‌ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపించ‌నున్న‌ట్టు రైల్వే అధికారులు బుధవారం ప్ర‌క‌టించారు. ప్రయాణికుల రద్దీని నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. వయా గుత్తి మీదుగా కాచిగూడ-కొట్టాయం-కాచిగూడకు స్పెష‌ల్ రైళ్లను నడపించ‌నున్నారు. కాచిగూడ-కొట్టాయం (ట్రెన్ నం. 07133) ట్రెన్ ఈ నెల 14, 21, 28 తారీఖుల్లో కాచిగూడలో మధ్యాహ్నం 3-40 నిమిషాల‌కు బయలుదేతది. తెల్ల‌వారు (మ‌రుస‌టిరోజు) ఈవినింగ్ 6 గంట‌ల 50 నిమిషాల‌కు కొట్టాయం చేరుతుందని పేర్కొన్నారు. దీని రిట‌న్ ప్రయాణపు ట్ర‌యిన్ (నం. 07134) ఇదే నెల 15, 22, 29 తారీఖుల్లో కొట్టాయంలో రాత్రి 8గంట‌ల 30 నిమిషాల‌కు బయలుదేత‌ది. మరుసటినాడు రాత్రి 11గంట‌ల 40 నిమిషాల‌కు కాచిగూడకు చేరుకుంటుంద‌న్నారు. ఇదేర‌కంగా హైదరాబాదు-కొట్టాయం (రైలునం. 07135) (వయా గుంతకల్లు) మీదుగా ఈ నెల 19, 26 తారీఖుల్లో ప‌గ‌టిలి( మ‌ధ్యాహ్నం) 12 గంటలకు హైదరాబాదులో బయలుదేత‌ది. మరుస‌టినాడు మధ్యాహ్నం 4 గంట‌ల‌10నిమిషాల‌కు కొట్టాయం చేరుతుంద‌ని పేర్కొన్నారు. దీని రిట‌న్ ప్రయాణపు ట్రయిన్ (నం. 07136) ఈ నెల 20, 27 తారీఖుల్లో కొట్టాయంలో ఈవినింగ్ 6 గంట‌ల 10 నిమిషాల‌కు బయలుదేత‌ది. మరుస‌టి నాడు రాత్రి 11 గంట‌ల 45నిమిషాల‌కు హైదరాబాదుకు చేరుకుంటుంద‌ని చెప్పారు. నాందేడ్‌-కొల్లాం ట్ర‌యిన్ నం 07139 స్పెష‌ల్ ట్ర‌యిన్ (వయా గుంతకల్లు) ఈ నెల 16తారీఖున నాందేడ్‌లో పొద్దున 8 గంట‌ల 20 నిమిషాల‌కు బయుదేరి మరుసటి నాడు రాత్రి 10.30 కొల్లాం చేరుతుంది. దీని రిట‌న్ ప్రయాణపు ట్ర‌యిన్ (నం. 07140) ఈనెల 18తారీఖున కొల్లాంలో తెల్లవారుజాము 2.30గంట‌ల‌కు బయలుదేరి మరుసటినాడు ప‌గ‌టిలి(మధ్యాహ్నం) 12 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంద‌న్నారు. మౌలాలి-కొల్లాం స్పెష‌ల్ రైలు (నం. 07141) (వయా గుంతకల్లు) ఈనెల 23, 30 తేదీల్లో మౌలాలిలో మధ్యాహ్నం 2-45 గంటలకు బయలుదేరి, మరుసటినాడు రాత్రి పదిన్నరకు కొల్లాం చేరుకుంటుంద‌న్నారు.

మ‌రిన్ని వార్త‌ల‌ కోసం కింది లింక్ ను క్లిక్ చేసి పాలో అవండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

న‌డిరోడ్డుపై దారుణ హ‌త్య‌ 15.11.2024 D.C Telugu Crime news

పుష్ప‌-2కు భారీ ప్లాన్‌ 15.11.2024 D.C Telugu Cinema

Karimnagar News” రైతులు పాడి పెంపకంపై దృష్టి సారించాలి

Viral Video” ఓరినాయ‌నో.. ఇదెక్క‌డి స్టంట్‌.. వీడియో వైర‌ల్

Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంత‌లోనే ఘోర ప్ర‌మాదం..

Viral Video” నీళ్ల‌లో తేలుతున్న బాడీ.. ఊరి వ‌చ్చేస‌రికి.. వైర‌ల్ వీడియో

Sea Plane” నీటి విమానం.. రేపే ప్రారంభం.. ట్రయిల్ రన్ వీడియో..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *