యూదులు, ఉక్రెయిన్ ప్రజలకు పార్లమెంటు తరఫున బేషరతు క్షమాపణ చెబుతున్నానని కెనడ ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే భారత్‌తో ఖలిస్తాని వివాదంతో ప్రపంచం ముందు ఒంటరైన కెనడా ఇప్పుడు నాజీల అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నాజీల కోసం పోరాడిన వ్యక్తిని పార్లమెంట్‌లో హీరోగా పొగిడినందుకు ఆయన క్షమాపణ చెప్పారు. నాజీని గుర్తించడం, ఆ వ్యక్తిని ఆహ్వానించడంలో పూర్తి బాధ్యత స్పీకర్‌దే అందుకే ఆయన బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. దీనివల్ల పార్లమెంట్, కెనడాను ఇబ్బంది పెట్టే తప్పిదమన్నారు. ఆ వ్యక్తి పూర్తి సమాచారం తెలియపోయినా సభలో ఉన్న వారు నిలబడి చప్పట్ల కొట్టినందుకు బాధపడుతున్నామని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడికి పార్లమెంటులో ఉన్న దౌత్యమార్గాల్లో క్షమాపణలు చెప్పినట్లు వివరించారు.
నన్ను క్షమిచండి కెనడా ప్రధాని ట్రూడో
