అరబ్‌ దేశాలకు పాక్ బిచ్చగాళ్లు..

పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే . ద్ర‌వ్యోల్భ‌ణం చుక్క‌ల్లో ఉండ‌డంతో ఇంధ‌న ఆయిల్‌, ఆహార ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆదేశంలోని పేదల ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. యాచ‌కుల పరిస్థితి మ‌రింత దారుణంగా మారింది. ఈ నేప‌థ్యంలో పేద‌లు, యాచికులు యాత్రికుల పేరుతో ప‌శ్చిమాసికు ప‌య‌న‌మ‌వుతున్నారు. అర‌బ్ దేశాలకు వెళ్లిన త‌రువాత అక్క‌డ బిచ్చ‌గాళ్ల‌గా మారుతున్నార‌ని , ఇరాక్‌, సౌదీ అరేబియా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌కు వివ‌రించారు. ఈ పరిస్ధితులపై ఓవర్సీస్‌ పాకిస్తానీస్‌ స్టాండింగ్‌ కమిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా వెస్ట్ ఆసియా దేశాల్లో క‌స్ట‌డీలోకి తీసుకున్న బిచ్చ‌గాళ్ల‌లో 90 శాతం పాక్ పౌరులే. ఇలా అదుపులోకి తీసుకున్న వారంతా ఇర్‌, సౌదీ అరేబియా దేశాల్లోని జై|ళ్ల‌లో బంధీలుగా ఉన్నారని ఓవర్సీస్‌ పాకిస్తానీల సెక్రటరీ జీషన్‌ ఖాన్‌జదా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *