అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఆలయ నిర్మాణం పూర్తి దశలో ఉంది. ఈ సందర్భంగా రామ మందిరానికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది. ఇది శుభపరిణామం, అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట, కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలోఅంటూ రాసుకొచ్చింది. తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు, జై సీతారామ్ అని పేర్కొంది.
శుభ పరిణామం..
అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట,
కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో…
తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు..జై సీతారామ్ pic.twitter.com/qzH7M32cQJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 10, 2023
ఇవి కూడా చదవండి
రేవంత్ అన్నా అని పిలవగానే.. మహిళ సమస్య విన్న సీఎం
మాజీ సీఎంను కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్రెడ్డి.. కేటీఆర్ భుజాలపై చేయివేసి..