ఇన్ని రోజులు బ్లాక్ మనీ పుట్టల్లో తల దాగి ఉన్న కట్టల పాములు బుసలు కొడుతూ ఇప్పుడు బయటకొస్తున్నాయి. తెలంగాణా ఓట్ల పండుగలో నోట్ల జాతర సాగుతోంది. కోడ్ కూసిన క్షణం నుంచే తనిఖీల్లో కోట్లు దొరుకుతున్నాయి. నోట్ల కట్టలు.. గుట్టలు గుట్టలుగా బయటపడుతన్నాయి. 8 రోజుల్లో కోట్ల రూపాయలు , మందు, బంగారు నగలు న్ని కలిపి రూ.101 కోట్ల మార్క్ దాటయి. షెడ్యూల్ వచ్చిన కొద్ది కాలంలోనే 101 కోట్లు దాటడం చర్చకు దారి తీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటిలోని కవాడిగూడ దగ్గర తనిఖీల్లో ఏకంగా రెండు కోట్ల 9 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఆరుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. మియాపూర్‌లో 17 కిలోల గోల్డ్, 17 కిలోల వెండి పట్టుబడింది. ఇక జిల్లా వారీగా చూసుకుంటే కొమురం భీం జిల్లా నగర్‌లో 99 లక్షలు, కరీంనగర్‌లో తనిఖీలు చేస్తున్న ఆఫీసర్లక రూ. 2 కోట్ల 36 లక్షల 50 వేల రూపాయలు పట్టబడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని లాల్ కోట క్రాసింగ్ వద్ద నగదు పట్టుబడింది. కర్ణాటకలోని రాయ్‌చూర్ నుండి నల్గొండకు పోతున్న డీసీఎం వెహికిల్‌లో 35 లక్షల 49 వేల రూపాయలు పట్టుబడ్డాయి. దీంతో వాటిని సీజ్ చేశారు. నల్గొండజిల్లా వాడపల్లి రూ. 3.4 కోట్ల రూపాయలు పట్టుబడగా, జిల్లాలో ఇప్పటి వకు 8 కోట్ల క్యాష్, 40 లక్షల విలువ గల మద్యం, ఒక కోటి రూపాయల విలువగల బంగారం పట్టుబడింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ప్పటి నుంచి రూ. 56 కోట్ల నగదును పోలీసులు వరకు సీజ్ చేశారు. బంగారం విషయానికి వస్తే 72 కిలోల గోల్డ్ సీజ్ అయ్యింది. వెండి, 429 కేజీలు, 42వజ్రాలను పట్టుకున్నారు. ఈ మూడింటివిలువ అందాద రూ. 39 కోట్లు వరకు ఉంటుంది. ఇంకోవైపు రూ. 7 కోట్ల మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మొత్తంగా అన్నింటి విలువ 101 కోట్లు దాటినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు 9మంది దుర్మరణం