5 వేల రాకెట్ల‌తో ర‌క్త‌పాతం సోష‌ల్ మీడియాలో వీడియోలు విడుద‌ల

శ‌నివారం తెల్ల‌వారుతుండ‌గా హ‌మాస్ గ్రూపు 5 వేల రాకెట్ల‌తో ఇజ్రాయిల్‌పై విరుచుకప‌డింది. దీనికి ప్ర‌తిగా ఇజ్రాయిల్ కూడా ప్ర‌తిగానే దాడుల‌కు దిగింది. రెండు దేశాల మ‌ధ్య భీక‌ర యుద్ధం కొన‌సాగుతోంది. ప్ర‌పంచ దేశాలు ఇజ్రాయిల్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. శ‌నివారం నాడు ఇరుదేశాల్లో 400 మంది మృతి చెందారు. ఇజ్రాయిల్‌పై అల్ అక్సా ఫ్ల‌డ్ చేపట్టిన‌ట్టు హ‌మాస్ గ్రూప్ వెల్ల‌డించింది. కేవ‌లం 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్ల‌తో విరుచుకుప‌డ్డ‌ట్టు హ‌మాస్ గ్రూప్ తెలిపింది. దీనికి ప్ర‌తిగా ఇజ్రాయిల్ కూడా ర‌ణ‌గ‌ర్జ‌న చేసింది. గాజా సిటీపై బాంబుల వ‌ర్షం కురిసింది. గాజా స్టిప్ర్ వ‌ద్ద ఉన్న 80 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఉగ్ర‌దాడిని ఇజ్రాయిల్ దేశాన్ని అమెరికాలోని 9/11 ఘ‌ట‌నతో పోల్చారు. యాబైఏండ్ల‌లో ఘోర‌మైన దాడుల‌లో ఇది ఒక‌ట‌ని ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ ఎయిర్‌ఫోర్స్ ప్ర‌తిదాడుల‌కు సంబంధించిన వీడియోలు ఆదివారం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోల‌ను చూడండి.

 

 

 

 

పేకాట ప‌త్తాల‌తో 40 అడుగుల నిర్మాణం భార‌త విద్యార్థి రికార్డు

తెలంగాణాలో మ‌రో రెవెన్యూ డివిజ‌న్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *