New Ration Cards” తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గవర్నమెంట్ అంచనా ప్రకారం.. కొత్తగా సుమారు 10 లక్షల రేషన్ కార్డుల మంజూరు ఉండవొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరునన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది వివరించారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ చేస్తే గవర్నమెంట్‌పై అదనంగా 956 కోట్ల రూపాయల భారం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను జారీ చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో అదనంగా పేర్ల నమోదుచేసుకునేందుకు గత 10ఏండ్లలో 18 లక్షల దరఖాస్తులు వచ్చాయని అవి పెండింగ్‌లో ఉన్నట్టు మంత్రి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చనంకా నూతన తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం నియమించారని వెల్లడించారు. ఆ ఉపసంఘంలో తనను ఛైర్మన్‌గా, సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదరం రాజనరసింహలు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేసేందుకు అవసరమయ్యే అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ చేసిన సిఫారసులు.. కేబినెట్ ముందుంచినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
New Ration Cards” కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
Intermediate Exams” తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీల ప్రకటన
Bluetooth Soundbar” ఈ సౌండ్ బార్‌ను తీసుకెళ్లండి.. మీ ఇంటిని హుషారెత్తించండి.. జస్ట్ రూ.1999కే.
Dell Laptop” తక్కువ ధరలో డెల్ కంపెనీ ల్యాప్‌టాప్.. 33990 రూపాయలే..
Noise Buds” నాయిస్ బడ్స్ కేవలం 1199 రూపాయలకే..
iQOO 13 5G” ఫీచర్స్ ఎక్కువే.. ధరా ఎక్కువే.. 54,999 రూపాయలు
Boat Smart Watch” బోట్ లూనార్ పీక్ స్మార్ట్ వాచ్.. అమెజాన్‌లో