హైదరాబాద్, : తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా వానలు పడనున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి వాగులు ఉధతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాల్లో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షం కురవడంతో పాడేరు ఏజెన్సీలో జనజీవనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏపీలోని ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది విశాఖ వాతావరణ శాఖ. మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలకు అవకాశమున్నట్లు తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్లు మినహా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణశాఖ సూచించింది. ఇటు తెలంగాణకు కూడా భారీ వర్షసూచన ఉందని ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు భారీగా వానలు పడతాయంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ సిటీలో వర్షం దంచి కొడుతుంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, ఫిల్మ్ నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయల్దేరినవారు ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి
వైసీపీ క్రిమినల్స్‌ను వదలబోం : పవన్ కళ్యాణ్
మోడీ నోటీస్.. సీరియస్ అవసరం లేదు
మావార్తలు మీకు నచ్చినట్టయితే పక్కనున్న గంట గుర్తు నొక్కండి. నోటిఫికేషన్ అలో అనండి