సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ చిత్రాన్ని జ్ఞానవెల్ డైరెక్షన్ లో చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో కూడా యాక్టింగ్ చేస్తున్నారు. రజిని, అమితాబ్ ఇద్దరు దిగ్గజాలు చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ పెట్టుకున్నారు. సస్పెండ్ అయిన అయిన పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో రజిని కాంత్ కనిపిస్తారని తెలుస్తుంది. సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమాకు ఫస్ట్ లుక్ టీజర్ డిసెంబర్ 12న రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ చిత్రం తర్వాత రజినికాంత్ 171వ సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ఉండనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తియ్యింది. ఈ సినిమా త్వరలో అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. సూపర్ స్టార్ బర్త్ డే రోజే ఈ ఈ చిత్రానికి ముహూర్తం పెడతారని వినికిడి. ఒక గ్యాంగ్ స్టర్ కథతో లోకేష్ వస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఉంది. ఖైదీ, మాస్టర్, విక్రం, లియో ఇలా వరుసగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. లోకేష్ కనకరాజ్ రజిని కాంబో సినిమాతో 1000 కోట్ల మార్క్ రీచ్ అవ్వాలని చూస్తున్నారు. రజిని 170వ సినిమా పూర్తి కాగానే 171వ సినిమా సెట్స్ విూదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో రజిని లుక్, క్యారెక్టరైజేషన్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. రజిని బర్త్ డే కానుకగా 170వ సినిమా టీజర్ తో పాటుగా లోకేష్ సినిమా అనౌన్స్ మెంట్ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. రీసెంట్ గా జైలర్ తో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చిన రజిని రాబోయే సినిమాలతో పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా రజిని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు అందించడంలేదు. జైలర్ సినిమాతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది. రాబోతున్న రెండు సినిమాలు కూడా జైలర్ హిట్ మేనియా కొనసాగిస్తాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
కాంతారాకు మూవీకి ప్రీక్వెల్ సన్నాహాలు మొదలు పెట్టామని ప్రకటన
దానికోసమే తండ్లాతున్నాం.. జగిత్యాలలో కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్