తెలంగాణాను తెచ్చిన పేరే ఆకాశమంతా పెద్దది. దాన్ని మించిన పదవి ఉన్నదా.. ఇంతకన్నా ఏంగావాలే.. క్లియర్‌గా చెబుతన్న సీఎం కేసీఆర్ జగిత్యాలలో ఎమోషనల్‌గా మాట్లాడారు. అయినా మీరు మన్నించి రెండు సార్లు ఇచ్చిన్రు కాబట్టి పదేండ్లు ముఖ్యమంత్రి చేసినన్నారు. నాఅంత ఎక్కువ కాలం పనిచేసి ముఖ్యమంత్రి ఎవడు లేడు అంటు చెప్పారు. గీడికి నాకు చాలు.. నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. కచ్చితంగా తెలంగాణా వందకు వంద శాతం పేదరికం లేని తెలంగాణ కావాలన్నదే నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా వంద శాతం అక్షరాస్యత ఉన్నటు వంటి రాష్ట్రం కావాలే. రైతాంగం హాయిగా నిద్రబోయి పంటలు పండే తెలంగాణ కావాలే. తెలంగాణాకు ప్రతి ఇంచుకు నీళ్లు రావాలే. దానికోసం తండ్లతున్నం తప్పితే.. ఈ పదవి కోసం కాదు. నాకు 70 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇంకేం కావాలే ఈ జీవితంలో అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది. పార్టీల వైఖరి.. నాయకుల ఆలోచన సరళి అన్నీ ఆలోచించి వోట్లు వేయాలే తప్ప ఆగమై వోట్లు వేయొద్దని నేను కోరుతున్నానని వివరించారు.
జగిత్యాలలో ఎమోషనల్‌గా మాట్లాడిన కేసీఆర్
100 శాతం పేదరికం లేని తెలంగాణ చేయాలన్నదే నా లక్ష్యం – సీఎం కేసీఆర్ pic.twitter.com/gJUsoop5Uv
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2023
యుద్దవిమానంలో ప్రధాని మోదీ..
రైళ్లోనే చెప్పుతో చితకబాదిన యువతి వీడియో వైరల్